Udan Yatri Cafe: పది రూపాయలకే టీ, స్నాక్స్.. ఎయిర్‌పోర్ట్స్‌లో చౌక ధరలకే ఆహారం!
విమాన ప్రయాణం అనగానే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనే భావన సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా విమానాశ్రయాలలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటాయి. ఒక కప్పు టీ, చిన్న స్నాక్ కోసం కూడా వందల రూపాయలు వెచ్చించాల్సిందే. కానీ, ఈ పరిస్థితికి తెరదించుతూ భారత ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. "ఉడాన్ యాత్రి కేఫ్‌లు" పేరుతో విమానాశ్రయాలలో చౌక ధరలకే ఆహారాన్ని అందించే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.
సామాన్యుడికి అందుబాటులో..
ఇటీవల చెన్నై విమానాశ్రయంలో రెండవ "ఉడాన్ యాత్రి కేఫ్"ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. కేవలం రూ.10కే వాటర్ బాటిల్ లేదా టీ, రూ.20లకే కాఫీ లేదా స్నాక్స్ అందిస్తూ, ఏ ప్రయాణికుడూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ కేఫ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే కోల్‌కతా విమానాశ్రయంలో ప్రారంభమైన "ఉడాన్ యాత్రి కేఫ్" విజయవంతంగా నడుస్తోందని, ప్రయాణికులు నాణ్యత, రుచి, ధరల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు.

దేశవ్యాప్త విస్తరణకు ప్రణాళికలు:
ప్రయాణికుల నుంచి లభిస్తున్న విశేష స్పందన దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు విమాన ప్రయాణాలకు మొగ్గు చూపుతున్న ప్రస్తుత తరుణంలో, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Inaugurated the UDAN Yatri Cafe today at Chennai Airport after the successful launch at Kolkata Airport. This is a transformatory initiative to provide pocket-friendly, hygienic food to travelers.
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) February 27, 2025
It is my commitment to ‘Ease of Flying’ and a testament to PM Shri @narendramodi… pic.twitter.com/wuimdoXUXz
చెన్నై విమానాశ్రయంలో అభివృద్ధి పనులు:
చెన్నై విమానాశ్రయం సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు. టెర్మినల్ 2 ఫేజ్ 2 నిర్మాణ పనులు పూర్తయితే, విమానాశ్రయం వార్షిక సామర్థ్యం 22 మిలియన్ల నుంచి 35 మిలియన్లకు పెరుగుతుందని ఆయన వివరించారు. అంతర్జాతీయ కార్యకలాపాలను మెరుగుపరచడానికి టెర్మినల్ 2 విస్తరణ 86,135 చదరపు మీటర్లలో జరుగుతోందన్నారు. అంతేకాకుండా, టెర్మినల్స్ 1, 4 పునరుద్ధరణ పనులు రూ.75 కోట్లకు పైగా పెట్టుబడితో జరుగుతున్నాయని వెల్లడించారు.
చెన్నైకి రెండవ విమానాశ్రయం..:
చెన్నైకి రెండవ విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనపై స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం దేశంలో మరిన్ని విమానాశ్రయాలను నిర్మించడానికి, అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. ఇది పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలు, ప్రగతికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరందూరులో ప్రతిపాదిత కొత్త విమానాశ్రయం స్థల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, కేంద్రం దానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, త్వరలో మరిన్ని సంప్రదింపులు జరిపి, తగిన ప్రక్రియను అనుసరిస్తామని స్పష్టం చేశారు. అయితే, పరందూరు విమానాశ్రయ ప్రాజెక్టుకు స్థానిక రైతులు, వ్యవసాయ భూముల యజమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.
-
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications