పోలింగ్ కేంద్రంలో డ్యూటీ: ఓటు వేస్తూ టీచర్ సెల్ఫీలు, సోషల్ మీడియాలో వైరల్, కేసు పాపం !

Posted By:
Subscribe to Oneindia Telugu

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల సందర్బంగా ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్ అత్యుత్సాహం చూపించి కష్టాలు కొనితెచ్చుకున్నాడు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ముందు నిలబడి ఓటు వేస్తూ సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఆయన మీద అధికారులు చర్యలు తీసుకున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లోని సాయిజీలోని ప్రభుత్వ పాఠశాలలో కమలేష్ కుమార్ ఆనే ఆయన డ్రాయింగ్ టీచర్ గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం మాండీ ప్రాంతంలోని ఓ పోలింగ్ కేంద్రంలో కమలేష్ కుమార్ కు ఎన్నికల విధులు నిర్వహించాలని ఎన్నికల అధికారి రాఘవ్ శర్మ అదేశించి ఆయనకు ఈవీఎంలు అందించారు.

Teacher on poll duty takes selfie wity postal ballt in Himachal Pradesh, booked

ఈవీఎంలు తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన టీచర్ కమలేష్ కుమార్ తన ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయించాడు. ఈవీఎం ముందు నిలబడి ఓటు వేస్తూ సెల్ఫీలు తీసుకున్నాడు. తరువాత ఆ ఫోటోలు వాట్సాప్ లో స్నేహితులకు పంపించాడు.

కమలేష్ కుమార్ తీసుకున్న సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈవిషయం ఎన్నికల అధికారి రాఘవ్ శర్మకు తెలిసింది. వెంటనే టీచర్ కమలేష్ కుమార్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించి నోటీసులు జారీ చేశామని ఎన్నికల అధికారి రాఘవ్ శర్మ చెప్పారు.

టీచర్ కమలేష్ కుమార్ తీసుకున్న సెల్ఫీల్లో ఈవీఎంలోని సీరియల్ నెంబర్లు స్పష్టంగా కనపడుతున్నాయని, ఎన్నికల నియమాలు ఉల్లంఘించిన ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని అధికారి రాఘవ్ శర్మ మీడియాకు చెప్పారు. టీచర్ కమలేష్ కుమార్ వేసిన ఓటు కూడా రద్దు చేశామని ఎన్నికల అధికారి రాఘవ్ శర్మ అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A government teacher, who was roped in for poll duty, has been booked for allegedly clicking a selfie, which he later circulated on social media, while casting his postal ballot in Himachal Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి