Teachers day 2024: విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దే గురువులందరికీ వందనం!

గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.. గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వంటి వారని, భగవంతుడితో సమానమని అటువంటి గురువుకు నేను సదా నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. సమాజంలో అజ్ఞానం అనే చీకటిలో ఉన్నవారిని తమ విజ్ఞానమనే జ్యోతితో వెలిగించి వారి జీవితాలలో వెలుగులు నింపేవారు ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయులందరికీ పండుగరోజు. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు నేడు.

నేడు ఉపాధ్యాయ దినోత్సవం
నేడు దేశవ్యాప్తంగా అందరూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా టీచర్స్ డే ను అక్టోబర్ 5వ తేదీన జరుపుకుంటే, భారతదేశంలో మాత్రం సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకోవడం ఆనవాయితీ. 1962వ సంవత్సరం నుంచి సెప్టెంబర్ 5వ తేదీన ప్రతి ఏడాది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటున్నాం.

Teachers day 2020 Salute to all the teachers who make the students well in the path of sarvepalli radhakrishnan

నేడు స్కూళ్ళు, కాలేజీలలో పండుగ వాతావరణం
ఇక ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు ప్రతి స్కూల్లోనూ పండుగ వాతావరణం ఉంటుంది. విద్యార్థులు తమ తమ గురువులను గౌరవించుకుంటారు. విద్యాబోధన చేసిన గురువులను సత్కరించుకొని, వారు చూపిన మార్గంలో నడిచేందుకు ప్రయత్నం చేస్తారు. గురుపూజోత్సవాన్ని నిర్వహించుకునే ఈరోజు టీచర్స్ పై తమకు ఉన్న భక్తిని ప్రస్ఫుటమయ్యేలా విద్యార్థులు చేసే వేడుకలు ప్రతి స్కూల్లోనూ ప్రత్యేకమే. ఒక్క పాఠశాలలలో మాత్రమే కాదు కళాశాలలలోనూ ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి.

సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజునే టీచర్స్ డే ఎందుకంటే
సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజునే మనం ఎందుకు టీచర్స్ డే గా జరుపుకుంటాము అన్నది చాలామందికి అర్థం కాని ప్రశ్న. దీనికి సమాధానం భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప టీచర్ గా ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది వారి జీవితం పైన తన మార్కు వేశారు. భారత దేశ తొలి ఉప రాష్ట్రపతిగా ,రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన గొప్ప అధ్యాపకుడిగా గుర్తించబడ్డారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్పతనం ఇది
భారతదేశంలో ఆనాడు ఉన్న మత ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని, తాత్విక అకడెమిక్ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప పండితులు సర్వేపల్లి రాధాకృష్ణన్. 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన ఆయనను గురువులకే గురువుగా భావించి ప్రతి సంవత్సరం టీచర్స్ డే ను జరుపుకుంటున్నాము.

గురువులకే గురువైన సర్వేపల్లి రాధాకృష్ణన్
సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్పతనాన్ని ఒక్క భారతదేశంలోనే కాదు ఇతరు దేశాల్లోని ప్రముఖులు కూడా కొనియాడారు అంటే ఒక అధ్యాపకుడిగా ఆయన ఘనత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. గాంధీ,హోవెల్, స్టాలిన్ వంటి వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ కొనియాడారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరాన్ని చెప్పారు. అసలు పుట్టినరోజు వేడుకలే చేసుకోవడం ఇష్టం లేని సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవంగా గురువులందరినీ గౌరవించుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.

విద్యార్థులను తీర్చిదిద్దే గురువులకు వందనం
ఏ రంగంలోనైనా ఎవరైనా సరే ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి దేశానికి కీర్తి తెచ్చారంటే దానికి మూలం ఉపాధ్యాయులే. వారు నేర్పిన విద్యాబుద్ధులే. గురువులు అందించిన విజ్ఞానంతో సంస్కార సౌజన్యాలతో పైకి ఎదిగిన వారే ..పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయులు పోషించే పాత్ర చాలా కీలకమైనది. ఇంతటి మహత్తర కార్యాన్ని నిర్వర్తించే గురువులు అందరికీ శిరసు వంచి ప్రణామాలు తెలియజేస్తోంది వన్ ఇండియా.. దేశంలోని ప్రతి ఒక్క విద్యార్థిని సమున్నతంగా తీర్చిదిద్దే బాధ్యతను గురువులందరూ తూచా తప్పకుండా నిర్వర్తిస్తారని నమ్ముతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+