తమిళనాడు లా అండ్ ఆర్డర్ సమస్య ! అపోలో ఎయిమ్స్ వైద్యులు
సోమవారం కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు గవర్నర్ విద్యాసాగర్ రావు ఫోన్ చేసి తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై వివరణ ఇచ్చారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడంతో ఆదివారం రాత్రి ముంబై నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అక్కడి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారని తెలిసింది.
ఇదే సమయంలో సోమవారం కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు గవర్నర్ విద్యాసాగర్ రావు ఫోన్ చేసి తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై వివరణ ఇచ్చారు. తమిళనాడులో శాంతి భద్రతలకు ఎలాంటి సమస్య లేదని, అంతా సవ్యంగా ఉందని చెప్పారని సమాచారం.

అదే విధంగా రాజ్ నాథ్ సింగ్ సూచనల మేరకు గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడు ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు చేసిన కృషి ఫలించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పర్యవేక్షణకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు చెన్నై చేరుకున్నారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యులు నేరుగా అపోలో ఆసుపత్రి చేరుకుని అమ్మకు చికిత్స చేస్తున్నారు.

జయలలితకు ఎలాంటి చికిత్స చెయ్యాలి ? అనే విషయంపై అపోలో, ఎయిమ్స్ వైద్యులు క్షుణ్ణంగా చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ ను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటూ జయలలితకు చికిత్స చేస్తున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications