వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్ మహీంద్రా సీఈఓకు ఏటా రూ. 150 కోట్ల వేతనం

టెక్ మహీంద్రా కంపెనీ సీఈవోగా ఉన్న వ్యవహరిస్తున్న సీపీ గుర్నాని వేతన ప్యాకేజీ వివరాలు బహిర్గతమయ్యాయి.గత మూడేళ్ళలో ఇతర కంపెనీల కంటే భారీ వేతాలను గుర్నానీ తీసుకొన్నట్టు తేలింది. రూ.2507 కోట్ల పారితోషిక

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: టెక్ మహీంద్రా కంపెనీ సీఈవోగా ఉన్న వ్యవహరిస్తున్న సీపీ గుర్నాని వేతన ప్యాకేజీ వివరాలు బహిర్గతమయ్యాయి.గత మూడేళ్ళలో ఇతర కంపెనీల కంటే భారీ వేతాలను గుర్నానీ తీసుకొన్నట్టు తేలింది. రూ.2507 కోట్ల పారితోషికాలను ఆర్జించినట్టు వెల్లడైంది.

ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా టెక్ కంపెనీలన్నీ వేతనాలు పెంచకుండా వాయిదావేస్తున్నాయి. టెక్ మహీంద్రలో కూడ ఉద్యోగుల వేతనాల పెంపు కోసం ఇంకా వేచిచూడాల్సిన అవసరం ఉంది.

Tech Mahindra CEO takes home more money than entire boards of TCS, Infosys & Wipro

అయితే ఆ కంపెనీ సీఈఓ గుర్నానీ మాత్రం దేశీయ ఐటి కంపెనీల ఇతర సిఈఓల కంటే ఎక్కువ వేతనాన్ని తీసుకొంటున్నట్టు తేలింది. 2017 మార్చి 31 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కూడ టాప్ 3 కంపెనీలు టీసీఎస్, ఇన్పోసిస్, విప్రో సిఈఓల కంటే కూడ అత్యధికంగా గుర్నాని పరిహరాలు పొందినట్టు వీసీ సర్కిల్ రిపోర్ట్ నివేదించింది.

పబ్లిక్ కంపెనీల్లో అత్యధికంగా వేతనాలు పొందే ఎగ్జిక్యూటివ్‌ల వివరాలను వీసీ సర్కిల్ రిపోర్ట్ చేసింది.గుర్నాని పారితోషికాల్లో రూ.147.17 కోట్లు స్టాక్ ఆఫ్షన్ల నుండి వస్తున్నట్టు తెలిసింది. ఆయన వేతనం ప్రావిడెంట్‌కు ఆయన అందించే సహకారం మొత్తం కలిపి రూ.2.56 కోట్లు. కాగా, టిసిఎస్, మాజీ సీఈఓ, ప్రస్తుత టాటా సన్స్ ఛైర్మెన్ చంద్రశేఖరన్ పారితోషకాలు రూ.30.15 కోట్లకు పెరగగా, ఇన్పోసిస్ సిఈఓ విశాల్ సిక్కా వేతనం స్వల్పంగా తగ్గి రూ. 45.11 కోట్లుగా ఉంది. విప్రో చీప్‌కు భారీగా వేతనాలు పెరిగినట్టు రిపోర్ట్ తెలిపింది.

English summary
Tech Mahindra chief executive officer C P Gurnani has topped India's highest- paid CEOs chart for the year 2016-17 with a remuneration of Rs 150 crore. a salary much higher than the pay package of entire boards of TCS, Wipro and Infosys
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X