ప్రేమ: సహోద్యోగినిని చంపి టెక్కీ ఆత్మహత్యాయత్నం

పోలీసుల కథనం ప్రకారం - 29 ఏళ్ల వెంకటాచలపతి టిసిఎస్ వెలాచెరి కార్యాలయంలో పనిచేస్తున్నాడు. 24 ఏళ్ల వైశ్య అనే తన సహోద్యోగిని మరో ప్రవీణ్ అనే మరో వ్యక్తిని ప్రేమిస్తుందని తెలుసుకుని ఆమెను వెంకటాచలపతి హత్య చేశాడు.
ఇరవై రోజుల కోసం నగరానికి వచ్చిన ప్రవీణ్ మన్నారుగుడిలోని వైశ్య ఇంట్లో ఉంటూ వచ్చాడు. దీన్ని వ్యతిరేకించిన వెంకటాచలపతి ఆమెను పేరుంగుడి రైల్వే స్టేషన్ వద్దకు రావాలని పిలిచాడు. ఆమె అతన్ని రైల్వే స్టేషన్ సమీపంలో కలిసింది.
వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో వెంకటాచలపతి ఆమెను కత్తితో పొడిచి చంపాడు. వైశ్య దేహంపై 16 కత్తిపోట్లు ఉన్నాయి. ఆ తర్వాత కత్తితో పొట్టలో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దారి వెంట వెళ్తున్నవారు పోలీసులకు సమాచారం అందించారు.
వెంకటాచలపతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వైశ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.












Click it and Unblock the Notifications