హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Techie: కూతుర్ని చంపేసి ఐదు రాష్ట్రాలు తిరిగేసిన టెక్కీ, భార్య మీద కోపంతో !

|
Google Oneindia TeluguNews

కోలారు/ బెంగళూరు: ఉద్యోగం చెయ్యడానికి భర్త అతని భార్య, కూతురితో కలిసి ఐటీ హబ్ వచ్చాడు. అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న వ్యక్తి అతని భార్య, కూతురితో జీవించాడు. ఇటీవల దంపతుల మద్య ఓ విషయంలో గొడవలు మొదలైనాయి. కూతురిని స్కూల్ లో వదిలిపెట్టి వస్తానని భర్త ఇంటి నుంచి కారులో బయలుదేరాడు. కోలారు జిల్లాలోని చెరువులో కూతురు శవమై కనిపించింది. అమ్మాయి తండ్రి శవం కోసం చెరువులో గాలించారు. అయితే కూతురిని హత్య చేసిన తండ్రి ఐదు రాష్ట్రాలు తిరిగేసి చివరికి పోలీసులకు చిక్కిపోవడం స్టోరీ మొత్తం బయటకు వచ్చింది.

Cheating: బెంగళూరు బ్యూటీ, చెన్నై చిన్నోడు, నా భర్త కస్టమ్స్ ఆఫీసర్ ?, రూ. 68 లక్షలు ఫట్ !Cheating: బెంగళూరు బ్యూటీ, చెన్నై చిన్నోడు, నా భర్త కస్టమ్స్ ఆఫీసర్ ?, రూ. 68 లక్షలు ఫట్ !

 ఉద్యోగం కోసం వచ్చాడు

ఉద్యోగం కోసం వచ్చాడు

గుజరాత్ కు చెందిన రాహుల్ కొన్ని సంవత్సరాల అతని భార్య రూపా (పేరు మార్చడం జరిగింది) సంతోషంగా కాపురం చేశాడు. ఉద్యోగం చెయ్యడానికి రాహుల్ అతని భార్యతో కలిసి బెంగళూరు చేరుకుని సిటీ సమీపంలోని హోసకోటే సమీపంలోని ఎన్ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

 భార్యతో ఢిష్యూమ్ ఢిష్యూమ్

భార్యతో ఢిష్యూమ్ ఢిష్యూమ్

రాహుల్, రూపా దంపతులకు మూడు సంవత్సరాల వయసు ఉన్న జియా అనే కుమార్తె ఉంది. బాగలూరు సమీపంలోని కణ్ణూరులో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న రాహుల్ అతని భార్య రూపా, కూతురితో చాలా సంతోషంగా జీవించాడు. రాహుల్, రూపా దంపతులకు కుమార్తె సమీపంలోని ప్లే స్కూల్ కు వెళ్లి వస్తోంది. కొంతాలంగా రాహుల్, రూపా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

 కూతురితో వెళ్లిపోయాడు

కూతురితో వెళ్లిపోయాడు

ఈనెల 15వ తేదీన రాహుల్ అతని కుమార్తె జియాను ప్లేస్కూ ల్ లో వదిలిపెట్టి వస్తానని కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. తరువాత రాహుల్, అతని కుమార్తె ఆచూకి లేకపోవడంతో అతని భార్యతో పాటు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోలారు గ్రామీణ జిల్లాలోని బెంగళూరు-చెన్నై హైవేలోని కందట్టి చెరువు సమీపంలో రాహుల్ కారును పోలీసులు గుర్తించారు.

 కూతురిని చంపేసి ఎస్కేప్

కూతురిని చంపేసి ఎస్కేప్

చెరువులో జియా (3) శవమై కనిపించింది. చెరువు చాలా పెద్దది కావడంతో రాహుల్ కోసం పోలీసులు గాలించారు. కొంతకాలం నుంచి రాహుల్ అతని భార్యతో గొడవ పడుతున్నాడని, ఇద్దరి మద్య రాద్దాంతం జరుగుతోందని పోలీసులు అన్నారు అయితే కూతురు జియాను హత్య చేసిన రాహుల్ ఆత్మహత్య చేసుకోవడానికి భయపడి పారిపోయాడని వెలుగు చూసింది.

 ఐదు రాష్ట్రాలు తిరిగేశాడు.

ఐదు రాష్ట్రాలు తిరిగేశాడు.

కూతురు జియాను హత్య చేసిన తరువాత కోలారు నుంచి బంగారు పేట వెళ్లిన రాహుల్ రైలులో తమిళనాడులోని వేలూరు వెళ్లాడు. వేలూరులో ఒక రోజు ఉండి తరువాత ఆంధ్రప్రదేశ్, అక్కడి నుంచి తెలంగాణ, అక్కడి నుంచి ఆగ్రా, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిపోయాడు. ఢిల్లీ నుంచి కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైలులో బెంగళూరు వచ్చిన రాహుల్ ను మెజస్టిక్ లో అరెస్టు చేశామని కోలారు జిల్లా ఎస్పీ దేవరాజ్ మీడియాకు చెప్పారు.

 విపరీతంగా అప్పులు చేసిన టెక్కీ

విపరీతంగా అప్పులు చేసిన టెక్కీ

రాహుల్ టెక్కీగా ఉద్యోగం చేసేవాడని, కరోనా టైమ్ లో అతని ఉద్యోగం పోయిందని పోలీసులు అన్నారు, ఇంట్లో నగలు చోరీ చేసి కుదవ పెట్టిన తన ఇంటిలో చోరీ జరిగిందని గతంలో రాహుల్ కేసు పెట్టాడని కోలారు జిల్లా ఎస్పీ దేవరాజ్ మీడియాకు చెప్పారు. నాలుగైదు సంస్థల దగ్గర లోన్ తీసుకున్నాడని, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన రాహుల్ సరైన సమయంలో తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేకపోయాడని కోలారు జిల్లా ఎస్సీ దేవరాజ్ మీడియాకు చెప్పారు.

English summary
Techie: Bengaluru Techie who killed his three years old daughter and made a abduction story and escaped in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X