Techie: అక్రమ సంబంధం, వరుసపెట్టి భార్య, అత్త, కూతురిని పొడిచేసిన టెక్కీ, భార్యకు పుట్టింటి దగ్గర!
న్యూఢిల్లీ/గుర్ గావ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు స్కూల్ కు వెలుతున్న కూతురు ఉంది. పెద్దలు సెట్ చేసిన పెళ్లి కావడంతో దంపతుల ఇరు వైపుల కుటుంబ సభ్యులు, బంధువులు టెక్కీ ఇంటికి వచ్చి వెలుతున్నారు. భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య పుట్టింటి దగ్గర ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు అనుమానం వచ్చింది.
భార్య ప్రవర్తన కూడా అలాగే ఉండటంతో టెక్కీకి ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది. ఇదే విషయంలో టెక్కీ దంపతుల మద్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యకు ఆమె తల్లి వత్తాసు పలికింది. ఈ విషయంలో రగిలిపోయిన టెక్కీ అతని భార్య, కూతురు, అత్తను కత్తితో దారుణంగా పొడిచేయడం కలకలం రేపింది.

రాజధానిలో టెక్కీ కాపురం
దేశరాజధాని ఢిల్లీలో సిద్దార్థ శర్మా అలియాస్ శర్మా (37) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం సిద్దార్థ శర్మా అతిథి (37) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న శర్మా, అతిథి దంపతులు చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు. అతిథి, శర్మా దంపతులకు 8 ఏళ్ల వయసు ఉన్న కూతురు ఉంది. గుర్ గావ్ లోని ప్రముఖ కంపెనీలో శర్మా సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు.

భార్యకు అక్రమ సంబంధం ఉందని టెక్కీకి డౌట్
తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ లో శర్మా, అతిథి దంపతుు నివాసం ఉంటున్నారు. పెద్దలు సెట్ చేసిన పెళ్లి కావడంతో శర్మా, అతిథి దంపతుల ఇరు వైపుల కుటుంబ సభ్యులు, బంధువులు వీళ్ల ఇంటికి వచ్చి వెలుతున్నారు. భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య పుట్టింటి దగ్గర ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు అనుమానం వచ్చింది.

భార్య ప్రవర్తన మీద ఇంకా అనుమానం
భార్య అతిథి ప్రవర్తన కూడా అలాగే ఉండటంతో టెక్కీ శర్మాకు ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది. ఇదే విషయంలో టెక్కీ శర్మా, అతిథి దంపతుల మద్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్య అతిథికి ఆమె తల్లి మాయాదేవి (60) వత్తాసు పలకడంతో టెక్కీ శర్మా జీర్ణించుకోలేకపోయాడు. మా ఫ్యామిలీ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకూడదని శర్మా అతని అత్త మాయాదేవికి తేల్చి చెప్పాడు.

వరుస పెట్టి అందరినీ పొడిచేసిన టెక్కీ
ఈ విషయంలో రగిలిపోయిన టెక్కీ శర్మా అతని భార్య అతిథి, కూతురు, అత్త మాయాదేవిని కత్తితో దారుణంగా పొడిచేయడం కలకలం రేపింది. తీవ్రగాయాలైన ముగ్గురిని వంసుధర ఎన్ క్లేవ్ లోని ధర్మశీ నారాయణ ఆసుపత్రికి తరలించారు. టెక్కీ శర్మా అత్త మాయాదేవి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు. అక్రమ సంబందం విషయంలో గొడవలు పడుతున్న శర్మా, అతిథి దంపతులు ఇప్పటికే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారని, కేసు విచారణలో ఉందని డీసీపీ ప్రియాంక కాశ్యప్ స్థానిక మీడియాకు చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications