అసభ్య వెబ్ సైట్ లో భార్య వివరాలు, ఫోన్ నెంబర్ పెట్టిన బెంగళూరు టెక్కీ, పగ, చివరికి !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: భార్యతో విభేదాలు రావడంతో ఆమె వివరాలు, ఫోన్ నెంబర్ అసభ్య వెబ్ సైట్ లో పెట్టి తీవ్రవేధింపులకు గురి చేసిన సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీరును బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో నివాసం ఉంటున్న హర్షవర్ధన్ భట్ (31) అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

బెంగళూరులోని ప్రసిద్ది చెందిన సాప్ట్ వేర్ కంపెనీలో హర్షవర్దన్ భట్ సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సొరబ తాలుకా హరిషి గ్రామానికి చెందిన హర్షవర్దన్ భట్ ఆరు సంవత్సరాల క్రితం సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న యువతిని వివాహం చేసుకున్నాడు.

Techie held for uploading wife’s profile on dating site in Bengaluru

హర్షవర్దన్ భట్ దంపతులు తరువాత బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో కాపురం పెట్టారు. సంవత్సరం క్రితం హర్షవర్దన్ భట్ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి హర్షవర్దన్ భట్ భార్య శీలం మీద అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఎవరితోనో తిరుగుతుందని ఆరోపిస్తూ వేధింపులకు గురిచేశాడు.

హర్షవర్దన్ భట్ మీద అతని భార్య కేసు పెట్టింది. ఈ కేసు విచారణ కోర్టులో ఉంది. తన మీద కేసు పెట్టిన భార్య మీద ఎలాగైనా పగతీర్చుకోవాలని హర్షవర్దన్ భట్ నిర్ణయించాడు. ఆన్ లైన్ డేటింగ్ (సహజీవనం) వెబ్ సైట్, అసభ్య వెబ్ సైట్ లో, కన్నడ మ్యాట్రిమోనియల్ లో భార్య వివరాలు, ఆమె ఫోన్ నెంబర్ పెట్టాడు.

అప్పటి నుంచి హర్షవర్దన్ భట్ భార్యకు వరసపెట్టి ఫోన్లు వస్తున్నాయి. తమతో సహజీవనం చెయ్యాలని అనేక మంది ఆమెను వేధింపులకు గురి చేశారు. తీవ్రఆవేదనకు గురైన ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు సీసీబీ పోలీసులకు అప్పగించారు. కేసు విచారణ చేసిన సీసీబీ పోలీసులు హర్షవర్దన్ భట్ ను అరెస్టు చేసి ల్యాప్ టాప్, మొబైల్ స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A senior software engineer with a private firm was arrested on Thursday for allegedly uploading his estranged wife's profile and mobile phone number on matrimonial and online dating websites in Bengaluru.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి