మాజీ ప్రియుడి ప్రేయసిని చంపేసిన మహిళా టెక్కీ

డిల్లీకి చెందిన జుహీ ప్రసాద్ న్యాయవాది. ఆమె పూణేకు చెందిన నీమేష్ సిన్హాను ప్రేమించింది. ఆమె కన్నా ముందు నీమేష్ అనుశ్రీ కుంద్రా అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ప్రేమించాడు. 2011 నవంబర్‌లో నీమేష్ ఫోన్ చేసి జూహీని ఫూణేకు ఆహ్వానించాడు. ఆమె పూణేకు వెళ్లింది.
అతని ఫ్లాట్‌లో వారిద్దరు ఓ రోజు గడిపారు. మర్నాడు ఉదయం అనుశ్రీ నీమేష్ ఫ్లాట్‌కు వచ్చింది. ఆ సమయంలో పడకగదిలో జుహీ నిద్రిస్తోంది. ఆమెపై అనుశ్రీ పెట్రోల్ పోసి నిప్పంచింది. ఈ సంఘటనలో జుహీ ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనలో నీమేష్ ప్రమేయం కూడా ఉందని, పథకం ప్రకారమే తన కూతురిని హత్య చేశారని జుహీ తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. జుహీని నీమేష్ రక్షించడానికి ప్రయత్నించలేదని, అలా చేసి ఉంటే కాలిన గాయాలతోనైనా తన కూతురు బయటపడి ఉండేదని ఆయన అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications