Techie: టెక్కీగా ఉద్యోగం, బెంగళూరులో ఇల్లు ఖాళీ చేసే ఒక్కరోజు ముందే?, ఆల్ ఖైదా, తాలిబన్లతో లింక్ లు !

ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్న టెక్కీ దేశం వదిలిపారిపోవడానికి విమానం టిక్కెట్లు సిద్దం చేసుకున్నాడు. ఇళ్లు ఖాలీ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న టెక్కీ కరెక్ట్ గా ఒక్కరోజు ముందు ఎన్ఐఏకి చిక్కిపోయాడు.

బెంగళూరు/లక్నో: తాను ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అని అందరికి చెప్పుకుంటున్నాడు. కానీ అతను చేస్తున్నది మాత్రం దేశద్రోహం. టెక్కీ కదలికలను పక్కాగా గమనిస్తున్న దర్యాప్తు సంస్థలు ఇప్పుడు అతడిని ట్రాప్ చేశాయి. ఇల్లు ఖాళీ చేస్తున్నామని ఇంటి యజమానికి చెప్పిన టెక్కీ సెటిల్ మెంట్ చేసుకున్నాడు. ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్న టెక్కీ దేశం వదిలిపారిపోవడానికి విమానం టిక్కెట్లు సిద్దం చేసుకున్నాడు. ఇళ్లు ఖాలీ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న టెక్కీ కరెక్ట్ గా ఒక్కరోజు ముందు ఎన్ఐఏ అధికారులకు చిక్కిపోయాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తూ ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్న అనుమానిత ఉగ్రవాది ఐటీ హబ్ లో అరెస్టు కావడంతో సాటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు హడలిపోయారు.

ఉత్తరప్రదేశ్ టూ బెంగళూరు

ఉత్తరప్రదేశ్ టూ బెంగళూరు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరిఫ్‌ అలియాస్‌ మహ్మద్‌ ఆరిఫ్‌ రెండున్నరేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చాడు. హెబ్బళ రింగ్ రోడ్డులోని మాన్యతా టెక్ పార్ట్ లోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ధణిసంద్రలోని మంజునాథ్ నగర్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆరీఫ్ నివాసం ఉంటున్నాడు. కానీ ఆరీఫ్ లక్ష్యం మాత్రం వేరే ఉంది.

హడలిపోయిన స్థానికులు

హడలిపోయిన స్థానికులు

శనివారం ఐఎస్‌డీ, కేంద్ర ఏజెన్సీలు, ఎన్ఐఏ అధికారులు ఆరీఫ్ నివాసం ఉంటున్న ధణిసంద్రలోని ఇంటిలో దాడులు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇల్లు ఖాళీ చేసే ఒక్కరోజు ముందే ఆరీఫ్ ఎన్ఐఏ అధికారులకు అడ్డంగా చిక్కిపోయాడు. టెలిగ్రామ్‌లో అల్ ఖైదా గ్రూపుల్లో ఆరిఫ్ యాక్టివ్‌గా ఉంటున్నాడని అధికారులు అంటున్నారు. అలాగే సిరియా, ఇరాన్ మీదుగా గతంలో దేశం వదిలేసి వెళ్లిపోయి ఆల్ ఖైదాలో చేరాలని ప్రయత్నాలు చేశాడని వెలుగు చూసింది.

 విమానం టిక్కెట్లు సిద్దం చేసుకున్నాడు

విమానం టిక్కెట్లు సిద్దం చేసుకున్నాడు

ఆ సమయంలో ఇరాన్, సిరియా మీదుగా వెళ్ళడానికి గతంలో చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని. ఆ రెండు దేశాల నుండి ఆరీఫ్ కు అనుమతి రాకపోవడంతో అప్పట్లో అతనికి సాధ్యం కాలేదని అధికారులు విచారణలో వెలుగు చూసింది. ఇప్పుడు మార్చి నెలలో మళ్లీ ఇరాన్ మీదుగా సిరియా, ఆఫ్ఘనిస్థాన్ వెళ్లాలని ప్లాన్ చేసిన ఆరీఫ్ ఫ్లైట్ టికెట్ కూడా సిద్ధం చేసుకున్నాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఐసీస్ ను వదిలేసి తాలిబన్లకు అభిమాని అయ్యాడు

ఐసీస్ ను వదిలేసి తాలిబన్లకు అభిమాని అయ్యాడు

గతంలో ఐఎస్‌ఐఎస్‌పై అభిమానం చూపిన టెక్కీ ఆరిఫ్ ఆ తరువాత ఆఫ్ఘనిస్థాన్‌లో అల్‌ఖైదా తాలిబన్‌ల చేతికి రావడంతో అతని మనుసు మార్చుకున్నాడని తెలిసింది. ఐసీస్ ను వదిలేసిన ఆరీఫ్ తాలిబాన్‌కు అనుకూలంగా మారాడు. తాలిబాన్ శక్తివంతం అయిన తరువాత అతని మొగ్గు అల్ ఖైదా మరియు తాలిబాన్ వైపు మళ్లింది. దీనికి తోడు గతంలో ట్విటర్‌లో ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ తరపున ఫేక్ అకౌంట్‌ను క్రియేట్ చేసి పోస్ట్‌లు పెట్టాడని అధికారులు అంటున్నారు.

బెంగళూరులో ఇల్లు ఎలా తీసుకున్నాడంటే ?

బెంగళూరులో ఇల్లు ఎలా తీసుకున్నాడంటే ?


ఉగ్రవాదులకు అనుకూలంగా ట్విట్లు చేస్తున్న ఆరీఫ్ నకిలి అకౌంట్ ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసింది. అప్పటికే మేల్కొన్న ఆరీఫ్ ట్విట్టర్ ఉపయోగించడం పూర్తిగ మానేశాడని అధికారులు గుర్తించారు. పక్కా ప్లాన్ వేసిన ఆరిఫ్ తన వద్ద ఉన్న భారతప్రభుత్వం కేటాయించిన పత్రాలు ఏవీ ఇవ్వకుండానే ధణిసంద్రలో అద్దె ఇంట్లో చేరి ఇంటి యజమానితో కేవలం అగ్రిమెంట్ చేసుకున్నాడని అధికారులు గుర్తించారు. వచ్చే నెలలో ఆఫ్ఘనిస్థాన్ వెళ్లాలని భావించిన ఆరీఫ్ ఇల్లు ఖాళీ చేస్తామని ఇంటి యజమానితో ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్నాడు.

ఒక్కరోజు ముందు చిక్కిపోయాడు

ఒక్కరోజు ముందు చిక్కిపోయాడు

గత రెండున్న సంవత్సరాల నుంచి అదే ఇంటిలో ఉంటున్న ఆరీఫ్ గతంలో ఇంటికి అడ్వాన్స్ గా 50 వేలు ఇచ్చాడని, దీంతో యజమాని పెయింట్ ఖర్చులన్నీ చెల్లించి శుక్రవారం రూ. 35 వేలు ఆరీఫ్ కు తిరిగి ఇచ్చేశాడని అధికారులు అన్నారు. అందుకే ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పాడు. ఫిబ్రవరి 12వ తేదీన ఆదివారం బెంగళూరులో ఇల్లు ఖాలీ చేసి ఉత్తరప్రదేశ్ వెళ్లడానికి ఆరీఫ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే శనివారం ఎన్ఐఏతో పాటు వివిద కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అధికారులు ఆరీఫ్ ఇంటి మీద ఒక్కసారిగా దాడులు చేశారు.

 టెక్కీ కాదు.... దేశద్రోహి !

టెక్కీ కాదు.... దేశద్రోహి !


ఆరీఫ్ ఇంట్లో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, హార్డ్ డిస్క్, కొన్ని పత్రాలు సహా పలు ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆరీఫ్‌ను అదుపులోకి తీసుకుని డు దొమ్మలూరులోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించి అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దేశపు అన్నం తింటూ ఈ దేశానికి ద్రోహం చేయడానికి ప్రయత్నించిన టెక్కీ ఆరీఫ్ బెంగళూరులో అరెస్టు కావడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+