Techie: భార్యను 72 ముక్కలు చేసిన టెక్కీ ఈరోజు ?, సేమ్ సీన్, అక్కడ మొగుడు, ఇక్కడ ప్రియుడు !
డెహ్రాడూన్/న్యూఢిల్లీ: యువతి, యువకుడు ప్రేమించుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. భర్త ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు. భార్యతో కలసి కొన్ని సంవత్సరాలు అమెరికాలో జీవించిన దంపతులు లైఫ్ ఎంజాయ్ చేశారు. తరువాత సొంత ఊరుకి చేరుకున్న టెక్కీ దంపతులు సంతోషంగా ఉన్నారు. టెక్కీ భార్య నుంచి ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్స్ రాకపోవడంతో వాళ్లు టెక్కీ ఇంటికి వెళ్లి అతన్ని నిలదీశారు. భార్య బంధువులు, పోలీసులను ఆ టెక్కీ ఇంట్లో అడుగుపెట్టనివ్వలేదు. పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో టెక్కీ వెనక్కితగ్గాడు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. టెక్కీ అతని భార్యను హత్య చేసి ఆమె శరీరాన్ని స్టోన్ కట్టర్ తో 72 ముక్కలు చేశాడని. ఆ టెక్కీ ఇప్పుడు తన బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించాడు.

లవ్ మ్యారేజ్
డెహ్రాడూన్ చెందిన రాజేష్ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేసేవాడు. 1999లో ఢిల్లీలో నివాసం ఉంటున్న అనుపమా అనే యువతి రాజేష్ కు పరిచయం అయ్యింది. ప్రేమించుకున్న రాజేష్, అనుప తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. రాజేష్ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేసేవాడు.

అమెరికాలో ఎంజాయ్
కొంతకాలం డెహ్రాడూన్ లో ఉద్యోగం చేసిన రాజేష్ తరువాత అతని భార్య అనుపమాతో కలిసి అమెరికా వెళ్లాడు. ఐదు సంవత్సరాల పాటు రాజేష్, అనుపమా దంపతులు అమెరికాలో సంతోషంగా జీవించారు. తరువాత డెహ్రాడూన్ చేరుకున్న రాజేష్, అనుపమా దంపతులు సంతోషంగానే ఉండేవాళ్లు.

అనుపమా నుంచి ఫోన్ కాల్స్ రాలేదని డౌట్
అమెరికాలో ఉన్న సమయంలో, డెహ్రాడూన్ వచ్చిన తరువాత ప్రతిరోజు అనుపమా ఆమె తల్లికి ఫోన్ చేసి మాట్లాడేది. 2010 నంబర్ లో అనుపమా చివరిసారి ఆమె తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. తరువాత అనుపమా నుంచి ఆమె తల్లికి కాని, కుటుంబ సభ్యులకు కాని ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు.

కేసు పెట్టిన అనుపమా అన్న
తన సోదరి కనపడటం లేదని 2010 డిసెంబర్ 17వ తేదీన అనుపమా సోదరుడు పోలీసు కేసు పెట్టాడు. అనుపమా నుంచి ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్స్ రాకపోవడంతో వాళ్లు టెక్కీ రాజేష్ ఇంటికి వెళ్లి అతన్ని నిలదీశారు. భార్య అనుపమా బంధువులు, పోలీసులను ఆ టెక్కీ రాజేష్ అతని ఇంట్లో అడుగుపెట్టనివ్వలేదు. పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో తరువాత టెక్కీ రాజేష్ వెనక్కితగ్గాడు.

భార్యను 72 పీస్ లు చేసిన టెక్కీ
పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చేశాయి, టెక్కీ రాజేష్ అతని భార్య అనుపమాను హత్య చేసి ఆమె శవాన్ని స్టోన్ కట్టర్ తో 72 ముక్కలు చేశాడని వెలుగు చూసింది. పోలీసులు రాజేష్ ను అరెస్టు చేశారు. డెహ్రాడూన్ జిల్లా సెషన్ కోర్టులో కొన్ని సంవత్సరాల పాటు టెక్కీ రాజేష్ భార్య అనుపమా హత్య కేసు విచారణ జరిగింది. భార్య అనుపమాను హత్య చేసిన రాజేష్ ఆమె శవాన్ని 72 ముక్కలు చేసి ఫ్రిజ్ లో పెట్టాడని పోలీసులు బలమైన సాక్షాలు కోర్టుకు సమర్పించారు.

టెక్కీకి యావజ్జీవ కారాగార శిక్ష
2017లో రాజేష్ అతని భార్య అనుపమాను కిరాతకంగా హత్య చేశాడని నేరం రుజువు అయ్యిందని డెహ్రాడూన్ జిల్లా సెషన్స్ కోర్టు అతన్ని జైలుకు పంపించారు. అప్పటి నుంచి రాజేష్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అనారోగ్యంతో 55 రోజులు పెరోల్ మీద బయటకు వచ్చిన టెక్కీ రాజేష్ తనకు పెరోల్ గడువు పొడగించాలని కోర్టును ఆశ్రయించాడు.

ఢిల్లీ శ్రద్దా కేసు టైమ్ లో టెక్కీ రాజేష్ కేసు హాట్ టాపిక్
రాజేష్ కు పెరోల్ గడువు పొడగించడానికి కోర్టు నిరాకరించింది. ఢిల్లీలో ప్రియుడు అఫ్తాబ్ అతన్ని ప్రేమించిన ముంబాయి ప్రియురాలు శ్రద్దాను ఇలాగే హత్య చేసి ఆమె శవాన్ని 35 ముక్కలు చేసి అటవి ప్రాంతంలో విసిరేశాడని వెలుగు చూసిన సమయంలోనే డెహ్రాడూన్ టెక్కీ రాజేష్ పెరోల్ గడవు పొడగించాలని కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications