దారుణం: బాలిక ప్రేమించలేదని బ్లేడ్లతో కోశారు
కోచి: అమ్మాయి ప్రేమించలేదని రెచ్చిపోయిన యువకుడు తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమె మీద దాడి చేశాడు. తరువాత ఐదు మంది బ్లేడ్లు తీసుకుని ఆమె శరీరాన్ని చీరేసిన సంఘటన కేరళలో జరిగింది. బాధితురాలు ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
కేరళలోని పెరుంబపూర్ సమీపంలోని కొడనాడ్ ప్రాంతంలో ఓ బాలిక (16) నివాసం ఉంటున్నది. ఈ బాలిక ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఓ యువకుడు ఆమెను ప్రేమిస్తున్నాడు. అయితే బాలిక అతడి ప్రేమను నిరాకరించింది.
బాలిక కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన విషయం ఆ యువకుడికి తెలిసింది. అంతే స్నేహితులతో కలిసి బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. తరువాత ఒంటరిగా ఉన్న బాలిక మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు.

బాలిక అర చేతుల మీద, శరరీరం మీద బ్లేడ్లతో కోశారు. తమ మీద పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించి వెళ్లారు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు బాలికను కోచ్చిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
గతంలో తమ కుమార్తెను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఐదు మంది నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications