Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆగష్టు 15 వేడుకల నుండి వస్తోన్న విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్

ఇంటర విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ చోటుచేసుకొంది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.ఆగష్టు 15 వేడుకలకు కాలేజీకి వెళ్ళి వస్తున్న విద్యార్థినిపై అత్యాచారం చేశారు నిందితులు

ఒడిశా: స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఇంటర్ విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకొంది.

ఒడిశా రాష్ట్రంలోని బంజనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెల్లుగుంటా ఔట్ పోస్ట్ పరిధిలో మందరా గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని బల్లిగుంఠా కాలేజీలో ఇంటర్ చదువుతోంది. స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు కాలేజీకి వెళ్ళి సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా నలుగురు యువకులు ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Teen alleges gang rape on I-Day in Odisha, cops arrest four

ధనుంజయపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు విద్యార్థిని బొడో నదికి సమీపంలోని చెట్లపొదల్లోకి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహతప్పి పడిపోయిన విద్యార్థినిని రొడ్డుపక్కన వదిలేసి వెళ్ళారు.

సాయంత్రం వరకు కూతురు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. నది ఒడ్డున కూతురు పడి ఉన్న విషయాన్ని గ్రామస్థుల ద్వారా తెలుసుకొన్న కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్ళారు.

బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. కుటుంబసభ్యులు బెల్లిగుంఠా ఔట్‌పోస్ట్ అధికారికి ఫిర్యాదుచేశారు. ధనుంజయ్‌పల్లికి చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+