మెట్రోలో సీట్ల గొడవ: యువకుడి దారుణ హత్య
న్యూఢిల్లీ : మెట్రో రైలులో జరిగిన సీట్ల గొడవ ఓ నిండు ప్రాణాన్ని తీసుకుంది. ఉత్తర ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉత్తర ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇరు వర్గాల విద్యార్థుల మధ్య సీట్ల కోసం గొడవ జరిగింది.
రైలులో సీటు కోసం గొడవ పడిన ఇషూ అనే విద్యార్థిని వేరే వర్గం విద్యార్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇషూపై కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి చంపారు. ఈ ఘటనకు పాల్పడిన విద్యార్థులు 16, 17 ఏళ్ల వయసు వారేనని పోలీసులు తెలిపారు.

16 ఏళ్ల వయస్సు గల ఇషూని హత్య చేసిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన విద్యార్థి, మిగతా విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గొడవ జరుగుతున్న సమయంలో ఓ యువకులు కత్తులు తీసి పొడిచినట్లు తెలుస్తోంది.
ఇషూ పడిపోగానే దాడి చేసిన విద్యార్థులు పారిపోయారు. ఇషూను ప్రజలే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయాలతో బుధవారం ఆర్థరాత్రి సమయంలో ఇషూ ప్రాణాలు విడిచాడు. తొలుత హత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దాన్ని హత్య కేసు కిందికి మార్చారు. దాడికి వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాడి చేసిన విద్యార్థులను జువెనైల్ హోం ముందు ప్రవేశ పెట్టి రిఫార్మ్ హోంమ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications