యువకుడి తల లేని మొండెం: గుండె, ప్రైవేట్ పార్ట్స్ మిస్
న్యూఢిల్లీ: దేశ రాజధాని డిల్లీలో ఓ యువకుడు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. 18 ఏళ్ల యువకుడి శవం దక్షిణ ఢిల్లీలోని భటి మైన్స్ అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం బయటపడింది. కుల్దీప్ అనే యువకుడి శవంగా దాన్ని గుర్తించారు. అదే ప్రాంతంలో అతని ఇంటికి 500 మీటర్ల దూరంలో శవం పడి ఉంది.
శవం నుంచి యువకుడి గుండె, ప్రైవేట్ పార్ట్స్ మాయమయ్యాయి. బండరాయితో మోది కుల్దీప్‌ను చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతని తల శవానికి 50 మీటర్ల దూరంలో పడి ఉంది. తలను మొండెం నుంచి వేరు చేయడానికి దుండగులు నరికి ఉంటారని అనుమానిస్తున్నారు.

యువకుడిని చంపడానికి రాళ్లను ఉపయోగించారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, జంతుపులు దాడి చేశాయని నిమ్మించడానికి కుల్దీప్ శవాన్ని అటవీ ప్రాంతంలో పడేశారని పోలీసులు అంటున్నారు. దొంగతనం చేయడానికి హత్యకు పాల్పడ్డారనే వాదనను పోలీసులు తిరస్కరిస్తున్నారు. మృతుడి బైక్‌ను, అతని వస్తువులను సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వస్తువులేవీ పోలేదు కాబట్టి చోరీ కోసం హత్య జరిగిందని చెప్పడానికి వీలు లేదని వారంటున్నారు.
తమకు కీలకమైన ఆధారాలు లభించాయని చెబుతున్నారు. ట్రయాంగిల్ లవ్ గానీ వ్యక్తిగత కక్షలు గానీ హత్యకు కారణమై ఉండవచ్చునని అంటున్నారు. యువకుడి శవం అత్యంత దారుణమైన స్థితిలో ఉందని, టాటూ సాయంతో గుర్తించామని వారు చెప్పారు. చేతిపై తన పేరును అతను పొడిపించుకున్నాడు. దాంతో అతన్ని గుర్తించినట్లు చెప్పారు.
కుల్తీప్‌కు నవంబర్ 10వ తేదీతో 18 ఏళ్లు వచ్చాయని, ఇటీవలే గుర్గావ్‌లోని ఓ సంస్థలో కొరియర్‌గా చేరాడని కుటుంబ సభ్యులు అంటున్నారు .












Click it and Unblock the Notifications