టీనేజ్ దళిత బాలికపై రేప్: చెట్టుకు వేలాడుతూ ఆమె శవం
లఖీంపూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బదాయూన్ వంటి మరో సంఘటన చోటు చేసుకుంది. ఓ టీనేజ్ దళిత బాలికపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఆమె శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఈ సంఘటన లఖీంపూర్ జిల్లాలోని నిఘాసన్ ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు గురువారంనాడు చెప్పారు.
పదహారేళ్ల అమ్మాయి శవం చెట్టుకు వేలాడుతూ మంగళవారం ఉదయం కనిపించింది. లక్నోకు 130 కిలోమీటర్ల దూరంలో గల తపర్వూర్వ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు ఈ సంఘటనతో పలు రాజకీయ పార్టీల నాయకులు అగ్రహోదగ్రులయ్యారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చెట్లకు ఉరేసుకుని వేలాడుతోందని వారు వ్యాఖ్యానించారు. అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తొలుత భావించారు. అయితే, అమ్మాయిపై అత్యాచారం జరిగిన తర్వాత ఆమె మరణించినట్లు పోస్టు మార్టం నివేదికలో తేలింది. ఇద్దరు యువకులపై అత్యాచారం, హత్య కింద కేసులు నమోదు చేశారు.
మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మనోజ్, ధర్మేష్ అనే ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఇంచార్జీ రామ్ కుమార్ యాదవ్ చెప్పారు. దర్యాప్తు సాగుతోందని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications