ఆటోలో ఎత్తుకెళ్లి అమ్మాయిపై సామూహిక అత్యాచారం
మీరట్: ఇంటికి వెళుతున్న బాలికను కిడ్నాప్ చేసిన నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసి కామాంధుల కోసం గాలిస్తున్నామని సోమవారం మీరట్ జిల్లా ఎస్పీ ఓం ప్రకాష్ తెలిపారు.
మీరట్ లోని నూర్ నగర్ సమీపంలో 15 సంవత్సరాల బాలిక నివాసం ఉంటున్నది. ఈ బాలిక కర్టన్స్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నది. ఆదివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. నూర్ నగర్ రైల్వే క్రాసింగ్ సమీపంలో నడిచి వెళుతున్న బాలికను ఇద్దరు కామాంధులు ఆటోలో కిడ్నాప్ చేశారు.

ఎదురు తిరిగిన బాలిక మీద దాడి చేశారు. ఆమె మొబైల్ లాక్కున్నారు. తరువాత నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. బాలిక సృహతప్పి పడిపోయింది. భయపడిన నిందితులు బాలికను తీసుకు వెళ్లి జూరాన్ పూర్ రైల్వే క్రాసింగ్ దగ్గర వదిలి పెట్టి పరారైనారు.
బాలిక ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే క్రాసింగ్ దగ్గర సృహతప్పిపడి ఉన్న బాలికను జురాన్ పూర్ గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు తరలించి కామాంధుల కోసం గాలిస్తున్నామని మీరట్ జిల్లా ఎస్పీ ఓం ప్రకాష్ తెలిపారు.












Click it and Unblock the Notifications