16 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి..: పక్కింటి వ్యక్తి కిరాతకం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని శంబాల్‌లో ఓ టీనేజ్ బాలికను కిడ్నాప్ చేసి అనంతరం అత్యాచారం చేసిన సంఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ ప్రాంతంలోని ఉండే బాలికను పక్కింటి వ్యక్తి ఎత్తుకెళ్లి రేప్ చేశాడని సోమవారం నాడు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన జనవరి 3వ తేదీన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక వయస్సు 16 ఏళ్లు. ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి పేరు ముఖేష్. బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆదివారం నాడు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అతనిని అరెస్టు చేశారు.

కారులో మృతదేహం
ఘజియాబాదులో ఓ 28 ఏళ్ల వ్యక్తి శనివారం నాడు తన కారులో విగతజీవిగా కనిపించాడని పోలీసులు చెప్పారు. ఓ దస్నా టౌన్లోని ఓ ప్రయివేటు కళాశాల సమీపంలో అతను కారులో మృతి చెంది కనిపించాడు. పోలీసులు కారు కిటికీలు పగులగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు.
తన తనయుడు కారులో మృతి చెందాడని తెలుసుకున్న అతని తండ్రి వెంటనే సంఘటన స్థలానికి వచ్చాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. తన కొడుకు శనివారం సాయంత్రం ఇంటి నుండి వెళ్లాడని, అప్పటి నుండి అతను ఎక్కడున్నాడో తమకు తెలియదని చెప్పాడు. తాము మిస్సింగ్ కేసు కూడా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications