మరో దారుణం: కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్‌రేప్
బరేలీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 14ఏళ్ల బాలికపై కదులుతున్న కారులో నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బరేలీ జిల్లాలోని ఫరీదాబాద్ టౌన్‌షిప్‌లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పాఠశాలకు వెళుతున్న బాలికను నలుగురు యువకులు కారు (ఎస్‌యువి) వాహనంలో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కారులో తిప్పుతూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను బెదిరింపులకు గురిచేశారు.

కాగా, ఇంటికి చేరుకున్న బాధిత బాలిక జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. బాధితురాలితోపాటు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె అత్యాచారానికి గురైందని నిర్ధారించారు. నలుగురు నిందితులలో ఇద్దర్నీ అరెస్ట్ చేసినట్లు రూరల్ ఎస్పీ బ్రిజేష్ శ్రీవాత్సవ తెలిపారు. ఇది ఇలా ఉండగా నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితుల బంధువులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అదనపు బలగాలతో భద్రతా చర్యలను చేపట్టామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications