అమ్మాయిపై ఎనిమిది నెలల పాటు అత్యాచారం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో ఎనిమిది నెలల పాటు వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు శనివారం ఈ విషయం చెప్పారు.
నిందితుడిని వినయ్‌గా పోలీసులు గుర్తించారు. అతన్ని జిల్లాలోని జ్వాలాపూర్ ప్రాంతంలో శుక్రవారంనాడు అరెస్టు చేశారు. తన కూతురిపై ఎనిమిది నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశింది.

చంపుతానని బెదిరించడంతో బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని ఇన్నాళ్లు దాచిపెట్టింది. ఆ విషయంపై ఏ రోజూ నోరు విప్పలేదు. బాధితురాలి తల్లి ఆ విషయాన్ని తన ఫిర్యాదులో చెప్పింది.
నిందితుడు కార్మికుడు. అతను గత ఏడాది కాలంగా బాధితురాలి ఇంటి పక్కనే ఉంటున్నాడు. బాలికపై కన్నేసి అతను అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు.












Click it and Unblock the Notifications