ఇంట్లోకి వెళ్లి కాలేజీ విద్యార్థినిపై రేప్: భూస్వామి కుమారుడి అరెస్ట్
కాన్పూర్: ఇంటర్మీడియట్ చదువుతున్న యువతి(17)పై ఓ భూస్వామి కుమారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కళ్యాన్పూర్ పరిధిలోని మంధన ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం... మంగళవారం రాత్రి బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో భూస్వామి కుమారుడు అంకూర్ వాజ్‌పాయి(25) ఆమె ఇంట్లోకి ప్రవేశించి... ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు.

అనంతరం అతడు పరారైయ్యాడు. బాధితురాలు వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి.. ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాధితురాలి ఇంటికి చేరుకుని.. కేసు నమోదు చేశారు.
అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఉదయం నిందితుడు అంకూర్ వాజ్‌పాయిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications