యాక్సిడెంట్ అని వెళ్తే రేప్ అని తెలిసింది

ముంబై: ముంబై నగరంలోని థానే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలైన బాలికను ఆసుపత్రికి తరలించగా ఆమె గర్బవతి అయ్యిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు షాక్ కు గురైనారు.

థానే పోలీసుల కథనం మేరకు వెగ్లా ఎస్టేట్ కాలనీలో 14 సంవత్సరాల బాలిక నివాసం ఉంటున్నది. ఈ నెల 6వ తేదిన థానే ప్రాంతంలో వేగంగా వచ్చిన వాహనం బాలికను డీకొనింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను ములుంద్ లోని ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు బాలికకు చికిత్స చేయించారు. తనకు ఎక్కువగా కడుపునొప్పి ఉందని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. విషయం తెలుసుకున్న వైద్యులు బాలికకు అబ్డామినల్ స్కానింగ్ నిర్వహించారు.

Teenage girl’s road accident reveals rape in Thane

ఈ పరిక్షల్లో బాలిక గర్బవతి అని వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాలిక తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు బుధవారం రాత్రి మహబూబ్ సయాద్ (23) అనే కామాంధుడిని అరెస్టు చేశారు.

బాలిక కుటుంబ సభ్యులు లేని సమయంలో మహబూబ్ సయాద్ బాలికను బెదిరించి అత్యాచారం చేశాడని, అందు వలనే ఆమె గర్బవతి అయ్యిందని పోలీసులు చెప్పారు. మహబూబ్ సయాద్ చిన్నిచిన్న పనులు చేస్తూ జీవనం సాగించేవాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+