బెంగళూరు వెళ్తూ విమానంలో అపస్మారకస్థితిలోకి వెళ్లిన పదహారేళ్ల బాలుడు, మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుంచి బెంగళూరు వెళ్లే విమానంలో ఓ టీనేజ్ బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లి, ఆ తర్వాత మృతి చెందాడు. కోల్‌కతాకు చెందిన ఆ బాలుడు చికిత్స కోసం వెళ్తూ చనిపోయాడు. పదహారేళ్లు సుమన్ పల్ వైద్య చికిత్స కోసం బెంగళూరుకు విమానం ఎక్కాడు.

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అతను అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో విమానాన్ని వెంటనే మళ్లీ ట్యాక్సీ బేలో ల్యాండింగ్ చేశారు. అపస్మారకస్థితిలో ఉన్న సుమన్‌ను అతని కుటుంబ సభ్యులు ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

Teenager falls unconscious in flight just before take-off at Kolkata airport, dies

వారి సూచన మేరకు అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే సుమన్ మృతి చెందినట్లు వైద్యలు నిర్ధారించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రయాణీకులు విమానంలో ప్రయాణించాలంటే ఫిట్ టు ప్లై సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.

అయితే తీవ్ర అనారోగ్యంతో ఉన్న సుమన్ ఆ సర్టిఫికేట్ తీసుకోకుండా ిమానం ఎక్కేందుకు ఎలా అనుమతించారన్న విషయమై పోలీసులు, విమానాశ్రయ అధికారులు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+