వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహితురాళ్ల ఫోటో ఫేస్‌బుక్‌లో పెట్టిన గర్ల్స్, మందలిస్తే..

By Srinivas
|
Google Oneindia TeluguNews

షిల్లాంగ్: అసోంలోని దిబ్రూగర్ జిల్లాలోని దులియజన్ ఏరియాకు చెందిన ఇద్దరు యువతులు రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికంగా ఉన్న కొందరు అమ్మాయిల ఫోటోల ఫోటోలను ఫేస్‌బుక్‌లో ఉంచారు. పెద్దలు మందలించి.. విషయం బయటకు తెలియడంతో వారు ఆత్మహత్యాయత్నం చేశారు.

సమాచారం మేరకు.. ఇతరులను అల్లరి చేద్దామని తాము అల్లరిపాలైన ఈ ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. వీరిద్దరు స్నేహితురాళ్లు నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ సృష్టించి, అందులో తోటి విద్యార్థినుల ఫోటోలు, ఫోన్ నెంబర్లు పెట్టారు.

teenagers attempt suicide after Facebook fiasco

దీంతో ఈ ఊర్లోని చాలామంది అమ్మాయిలకు అసభ్యకరమైన ఫోన్లు రావడం మొదలైంది. దీంతో అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు వీరి తుంటరి పనిని బట్టబయలు చేశారు.

దీంతో వారిని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. స్థానికులు వారిని ప్రశ్నించారు. విషయం బట్టబయలు కావడంతో అవమానంగా భావించిన ఆ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకోవాలని భావించారు.ఒకమ్మాయి బ్లేడుతో గాట్లు పెట్టుకోగా, మరో అమ్మాయి ఫినాయిల్ తాగింది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిద్దరి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది.

English summary
Two teenage girls from the Duliajan area in Dibrugarh district on Thursday evening attempted to commit suicide after being reprimanded by elders for uploading objectionable posts about local girls through a fake Facebook account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X