‘ఐ మిస్ యూ పాపా’: నిశ్చితార్థం రోజున లాలూ కోసం తేజ్ ప్రతాప్ భావోద్వేగ ట్వీట్
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నిశ్చితార్థం బుధవారం ఘనంగా జరిగింది. బీహార్ మాజీ మంత్రి చంద్రిక రాయ్ కుమార్తె అయిన ఐశ్వర్య రాయ్‌ను తేజ్ ప్రతాప్ పెళ్లాడబోతున్నారు.
పాట్నాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బుధవారం వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. దాదాపు 200 మంది దగ్గరి బంధువులు ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం సందర్భంగా ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె నుంచి పూలు తెప్పించి ప్రత్యేకంగా అలంకరించారు.

కాగా, దాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. దీంతో తేజ్ ప్రతాప్ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 'మిస్ యూ పాపా' అని తన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
Miss you PAPA 😔
— Tej Pratap Yadav (@TejYadav14) April 18, 2018
నిశ్చితార్థానికి రాలేకపోయినా.. తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి వేడుకకు మాత్రం లాలూ పెరోల్‌పై వచ్చే అవకాశం ఉంది. మే 12న పాట్నాలోని ఓ కళాశాల మైదానంలో తేజ్‌ప్రతాప్- ఐశ్వర్యల వివాహం జరగబోతోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications