'ఓటర్ లిస్టులో నా పేరు లేదు.. ఎలా పోటీ చేయాలి'... తేజస్వీ యాదవ్ సంచలనం
బిహార్ రాష్ట్రం ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఈ ఏడాది చివర్లో బిహార్ లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఈసీ చేపట్టిన ప్రత్యేక సర్వే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వేలో భాగంగా ఈసీ ఇటీవల బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 65 లక్షలకు పైగా పేర్లు తొలగించింది ఈ మేరకు ఆగస్టు 1న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 18 లక్షల మంది ఓటర్లు మరణించారని.. మరో 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. మరో 7 లక్షల మంది ఓటర్లు రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారని స్పష్టం చేసింది. అయితే తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 30, 2025న ప్రచురించనున్నట్లు తెలిపింది.
అయితే ఈసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో తన పేరు లేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. ఈ మేరకు ఈసీ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఎలా పోటీ చేయాలంటూ తేజస్వి యాదవ్ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. స్వయంగా బూత్ లెవల్ అధికారే తన దగ్గరకు వచ్చి ఫామ్ తీసుకెళ్లారని.. మరి తుది జాబితాలో పేరు ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 20 నుంచి 30 వేల వరకు ఓటర్లను తొలగించారని తేజస్వీ యాదవ్ ఆరోపణలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ముసాయిదాలో పేరు ఉందని.. బహుశా తన పాత ఎపిక్ నంబరుతో చెక్ చేసుకుని ఉంటారని.. అందుకే ఆయన పేరు జాబితాలో కన్పించకుండా ఉండొచ్చని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది.

మరోవైపు దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొంత కాలంగా విమర్శలు చేస్తున్నారు. ఈసీ ఓట్లను చోరీ చేసి ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ మేరకు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఈ వ్యాఖ్యలు నిరాధారమైనవిగా అభివర్ణించింది. తాము దేశ ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేస్తున్నామని.. ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే రాహుల్ గాంధీ మాత్రం.. ఎన్నికల సంఘంలోని టాప్ టూ బాటమ్ అధికారులను వదలం అని వాళ్లంతా ఇందులో పాత్రులేనన్నారు. ఈసీ అక్రమాలపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications