మళ్లీ ఆనాటి రెండు గ్లాసుల అనాచారం..: నాడు సైమన్ గో బ్యాక్.. నేడు సర్ గో బ్యాక్: రేవంత్

ఢిల్లీలో ఇండియా కూటమి తలపెట్టిన సుప్రీంకోర్ట్ మార్చ్ ఆందోళనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో పౌరులను రెండు రకాలుగా విభజిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమకు అనుకూలంగా ఉండే శ్రీమంతులకు ఓటు హక్కును కల్పిస్తూ, వ్యతిరేకంగా ఉండే పేదలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలను ఓటు హక్కు లేని ద్వితీయ శ్రేణి పౌరులుగా మారుస్తోందని ఆరోపించారు. పౌరులు ఓటు హక్కును కోల్పోతే వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని, మళ్లీ సమాజంలో రెండు రకాల పౌరసత్వ విధానాన్ని, నాటి రెండు గ్లాసుల అనాచారాన్ని అమల్లోకి తెస్తున్నారని మండిపడ్డారు.

Telangana Congress leaders has participated March For Democracy in Barakhamba Road to Supreme Court

దేశవ్యాప్తంగా ఓట్లను తొలగించడం ద్వారా మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో అధికార పార్టీ రాజకీయ లబ్ధి పొందిందని, ఎస్ఐఆర్ అమలుకాని రాష్ట్రాల్లో మాత్రమే ఇతర పార్టీలు విజయం సాధించాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో తప్పులు జరుగుతున్నాయని సొంత కమిషనర్లే చెప్పినా కేంద్రం స్పందించకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఈ కుట్రలో కేంద్ర ప్రభుత్వానికి నేరుగా భాగస్వామ్యం ఉందనడానికి, ఆయన ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందడానికే జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడుతున్నారని ఆరోపించారు. నాటి బ్రిటిష్ పాలకులు అవలంబించిన విభజించి పాలించే సూత్రాన్నే నేడు బీజేపీ కూడా దేశంలో అమలు చేస్తోందని ఆయన విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో సంపూర్ణ జవాబుదారీతనం, పారదర్శకత నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య హక్కులను హరించే ప్రయత్నాలను సహించేది లేదని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకులను నిర్బంధించడం సరికాదని హితవు పలికారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక ఓటు హక్కును కాపాడుకోవడానికి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు తేల్చిచెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+