అమరావతికి తమిళనాడు సీఎం విజయ్- చంద్రబాబు, జగన్ తో భేటీ: కీలక చర్చలు..!!

తమిళనాడు సీఎం విజయ్ ఏపీ పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి విజయ్ ఏపీకి వస్తున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ ఫిక్స్ చేసారు. ఈ పర్యటనలో విజయవాడ ఉత్సవ్ 2.0 లో పాల్గొంటారు. సీఎం చంద్రబాబుతో పాటుగా మాజీ సీఎం జగన్ తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇంద్రకీలాద్రి ఆలయానికి వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఈ నెల 13వ తేదీన అమరావతి పర్యటన ఖరారైంది. విజయ వాడ ఉత్సవ్‌ 2.0'లో పాల్గొనాలంటూ ఏపీ ఎంపీలు ఇటీవల విజయ్‌ను కలిసి ఆహ్వానించడంతో ఆ ఉత్సవంలో పాల్గొనేందుకు విజయ్‌ నిర్ణయించారు. విజయవాడలో జాతీయ సరస్‌ ప్రదర్శనను ఆయన తిలకించనున్నారు. సీఎంను చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకో నున్నారు. ఇద్దరి మధ్య రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వ్యవహారాల పైన చర్చ జరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం చేరుకోనున్న విజయ్.. 4.15 గంటలకు సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు. ఆ తరువాత మాజీ సీఎం జగన్ ను కలుస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నారు. సాయంత్రం 6 గంటలకు సరస్, ఇంద్రకీలాద్రి సందర్శించనున్నారు.

 జనసేన -బీజేపికి దక్కే మేయర్, మున్సిపల్ సీట్లు ఫైనల్: ఎవరికి ఎక్కడ..!!
జనసేన -బీజేపికి దక్కే మేయర్, మున్సిపల్ సీట్లు ఫైనల్: ఎవరికి ఎక్కడ..!!
tamil-nadu-cm-vijay-s-vijayawada-visit-confirmed-to-meet-chandrababu-naidu-at-his-residence

విజయ్ పర్యటన పై ఆసక్తి

పర్యటన పూర్తి చేసుకొని రాత్రి 8.30 గంటలకు విజయ్ తిరిగి చెన్నై వెళ్లనున్నారు. తొలుత పవన్ తోనూ భేటీ ఉంటుందని భావించినా... ఇప్పటి వరకు పవన్ తో సమావేశం షెడ్యూల్ పైన అధికారి కంగా ఎలాంటి సమాచారం లేదు. చెన్నైకి రావాల్సిన కృష్ణా జలాల గురించి చంద్రబాబు వద్ద విజయ్‌ ప్రస్తావించనున్నట్లు తెలిసింది. ప్రస్తుత ఎల్‌నినో తరుణంలో చెన్నైకు మంచినీటి సరఫరాపై విజయ్‌ చేసే ప్రస్తావన పై చంద్రబాబు స్పందన కీలకంగా మారుతోంది. కాగా.. విజయ్ సీఎం కావటానికి ముందు జగన్ తో చెన్నై వేదికగా కలుసుకున్నారు. ఇప్పుడు ఏపీకి వస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్ ను కూడా విజయ్‌ కలిసే అవకాశం ఉందని టీవీకే వర్గాలు తెలిపాయి. దీంతో.. విజయ్ ఏపీ పర్యటన పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+