గుర్తుంచుకోండి.. ఇప్పుడు యావత్ దేశం జంతర్ మంతరే: అభిజిత్ దిప్కే
దేశ రాజధానిలో దశాబ్దాలుగా వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నిరసనలకు ప్రధాన కేంద్రంగా నిలుస్తూ వచ్చిన జంతర్ మంతర్ ఇకపై ధర్నా వేదికగా అందుబాటులో ఉండదు. ఈ ప్రదేశాన్ని అధికారిక నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించింది. డీనోటిఫై చేసింది. ప్రజా ఆందోళనల నిర్వహణ కోసం ప్రత్యామ్నాయ స్థలాలను అన్వేషించడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక, సిఫార్సుల ప్రాతిపదికన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కాక్రోచ్ జనతా పార్టీ, ఇండియా బ్లాక్ నాయకులు మండిపడ్డారు. అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణించారు. ఈ నిర్ణయాన్ని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఖండించారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును అణచివేయడానికే ఈ రకమైన చర్యలకు కేంద్రం పాల్పడుతోందని ఆరోపించారు. నిరసనల వేదికను రద్దు చేసినంత మాత్రాన ప్రజల గొంతుకను నొక్కడం సాధ్యం కాదని, ఇకపై దేశమంతా జంతర్ మంతర్‌లా మారుతుందని హెచ్చరించారు.

ఇదే అంశంపై సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా కూడా స్పందించారు. పోలీసుల చర్యను తప్పుపట్టారు. పౌర సమాజం, వివిధ నిరసన సంఘాలతో ఎలాంటి ముందస్తు సంప్రదింపులు జరపకుండానే హోం మంత్రిత్వ శాఖ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని సౌరవ్ దాస్ విమర్శించారు. ప్రభుత్వం సూచించిన కొత్త ప్రత్యామ్నాయ ప్రాంతాలు ప్రజలకు అందుబాటులో ఉండవని, ఇటువంటి నిర్ణయాలు పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీస్తాయని అశుతోష్ రంకా అభిప్రాయపడ్డారు.
They have removed Jantar Mantar as a designated protest site.Yes, it’s no a longer protest site as anyway it was turned into a war zone by the coward dictator. Ab poora desh Jantar Mantar banega!
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 12, 2026
దీనిపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. రామ్ లీలా మైదాన్ లో దసరా ఉత్సవాలు వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, అలాంటి చోటును ధర్నాలకు కేటాయించడం సరికాదని అన్నారు. మహిళలను శక్తిస్వరూపిణిగా పూజలు అందుకునే ప్రదేశంలోనే.. నిరసనలకు దిగిన అదే మహిళలపై కేంద్ర బలగాలు, పోలీసులు అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
🚨STATEMENT🚨Unacceptable.Why is Narendra Modi scared of Jantar Mantar?The Jantar Mantar belongs to THE PEOPLE OF INDIA. Did the Ministry of Home Affairs consult with the people of India? Were any stakeholders consulted? Were any organisations consulted?Take it in writing—just how they are denotifying people’s Jantar Mantar, the Prime Minister will soon denotify democracy in India. This move is a step towards that.We do not accept this arbitrary decision. It is an assault on people’s fundamental right to protest and peaceful assembly. Ab poora desh Jantar Mantar ban raha he!@Cockroachisback
— Saurav Das (@SauravDassss) October 12, 2026
ప్రతీ మహిళలోనూ ఒక అమ్మవారు దాగి ఉందనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని, తమపై జరుగుతున్న అణచివేతపై మహిళలందరూ సంఘటితంగా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె హెచ్చరించారు. దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకొంటూ, మహిళలను దేవీ రూపాలుగా పూజిస్తోంటే, కేంద్రం మాత్రం మహిళలపై అరాచకాలు, వేధింపులకు గురి చేస్తోందంటూ మండిపడ్డారు. హిందూత్వ విధానాలకు, క్షేత్రస్థాయిలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలకు పొంతనే లేదని విమర్శించారు.
Why not declare Mt Everest as the designated protest site?
— Ashutosh Ranka (@AshutoshRanka) October 12, 2026












Click it and Unblock the Notifications
