తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి: 4 రాష్ట్రాలతోనే ఎన్నికలు
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ముందస్తు ఎన్నికలకు అనుకూల వాతావరణం ఉందని ఈసీ కమిటీ నివేదించింది. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్‌కు ఉమేష్ సిన్హా కమిటీ నివేదిక సమర్పించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్‌గఢ్‌లతో పాటు ఎన్నికలు నిర్వహించవచ్చునని ఈ కమిటీ నివేదికలో తెలిపింది. దీంతో తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ దాదాపు నిర్ణయించింది.
వారం, పది రోజుల్లో తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రానున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల తేదీపై ఈసీ కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.

కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటర్ల జాబితా విషయమై మాత్రమే అభ్యంతరం చెప్పింది ఈసీ కమిటీ నివేదించింది. వివిధ పార్టీలు లేవనెత్తిన అంశాలను ఈసీ కమిటీ తోసిపుచ్చింది. వీవీపాట్స్, ఈవీఎంలు అందుబాటులోకి వస్తాయని ఉమేష్ సిన్హా కమిటీ తెలిపింది.
శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఏర్పాట్లను పరిశీలించిన ఉమేష్ సిన్హా కమిటీ సీఈసీ ఓపీ రావత్‌కు నివేదికను అందించింది. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసి, ముందస్తుకు అనుకూల వాతావరణం ఉందని చెప్పింది. మొత్తం మీద నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications