సాధించిన కేసీఆర్, కానీ రెండేళ్ల తర్వాతే! (పిక్చర్స్)

రాయ్‌పూర్: తెలంగాణలో విద్యుత్తు కొరత నివారణ దిశగా మొదటి అడుగు పడింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు రమణ్ సింగ్, కేసీఆర్ సమక్షంలో ఇరు రాష్ట్ర అధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని మధ్వ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేస్తారు. ఈ ప్రాజెక్టులో వచ్చే ఏడాది మార్చి నుంచి విద్యుదుత్పాదన ప్రారంభమవుతుందంటున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్తు తెలంగాణకు రావాలంటే రెండున్నరేళ్ల నుండి మూడేళ్లకు పైగా పడుతుందని తెలంగాణ ఇంధన నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

విద్యుత్ ఒప్పందం

విద్యుత్ ఒప్పందం

తెలంగాణ రాష్ట్రానికి వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి చత్తీస్‌గఢ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో సోమవారం రెండు రాష్ట్రాల సిఎంలు రమణ్ సింగ్, కేసీఆర్ సమక్షంలో ఒప్పంద అవగాహన పత్రాలు రాసుకున్నారు.

విద్యుత్ ఒప్పందం

విద్యుత్ ఒప్పందం

తెలంగాణ, చత్తీస్‌గఢ్ విద్యుత్ శాఖ కార్యదర్శిలు ఎస్‌కె జోషి, అమన్ సింగ్ పరస్పరం సంతకాలు చేశారు. చత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేయబోయే విద్యుత్ ధర ఖరారుపై త్వరలో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదురుతుంది.

విద్యుత్ ఒప్పందం

విద్యుత్ ఒప్పందం

ధరను తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఖరారు చేయనుంది. ప్రస్తుతం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయనుంది.

విద్యుత్ ఒప్పందం

విద్యుత్ ఒప్పందం

రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణకు చత్తీస్‌గఢ్ రాష్ట్రంతో కుదిరిన ఒప్పందంతో పెద్ద ఉపశమనం కలిగినట్టయ్యింది.

విద్యుత్ ఒప్పందం

విద్యుత్ ఒప్పందం

విద్యుత్ సరఫరాకు లైన్లు వేయడానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టనుంది. నెల రోజుల్లో దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

విద్యుత్ ఒప్పందం

విద్యుత్ ఒప్పందం

విద్యుత్ లైన్ ఏర్పాటులో జాప్యం జరిగే పక్షంలో మహారాష్ట్ర మీదుగా విద్యుత్ పొందే అవకాశాలను తెలంగాణ అధికారులు పరిశీలిస్తున్నారు.

విద్యుత్ ఒప్పందం

విద్యుత్ ఒప్పందం

ప్రస్తుతం కుదిరిన ఒప్పందం మేరకు ఇవ్వనున్న వెయ్యి మెగావాట్ల విద్యుత్‌కు అదనంగా మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలంటూ కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి చత్తీస్‌గఢ్ సిఎం రమణ్ సింగ్ పరిశీలిస్తామంటూ సానుకూలంగా స్పందించారు.

విద్యుత్ ఒప్పందం

విద్యుత్ ఒప్పందం

తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

నయా రాయ్‌పూర్ పరిశీలించిన కేసీఆర్

నయా రాయ్‌పూర్ పరిశీలించిన కేసీఆర్

నిర్మాణంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ కొత్త రాజధాని నగరం నయా రాయ్‌పూర్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం సాయంత్రం సందర్శించారు.

నయా రాయ్‌పూర్ పరిశీలించిన కేసీఆర్

నయా రాయ్‌పూర్ పరిశీలించిన కేసీఆర్

5,000 కోట్ల రూపాయల వ్యయంతో 8,000 హెక్టార్లలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొత్త రాజధాని నగరాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

నయా రాయ్‌పూర్ పరిశీలించిన కేసీఆర్

నయా రాయ్‌పూర్ పరిశీలించిన కేసీఆర్

మహానది భవన్ పేరుతో నిర్మిస్తున్న సచివాలయంతో పాటు రహదారులు, సోలార్ లైట్లు, ఎల్ఈడీ సోలార్ లైట్లు, ఐటీ పార్కు, సరస్సులు, ఉద్యానవనాలు, జంగల్ సఫారీ, కల్చరల్ మ్యూజియం, అసెంబ్లీ తదితర నిర్మాణాలను కేసీఆర్ పరిశీలించారు.

నయా రాయ్‌పూర్ పరిశీలించిన కేసీఆర్

నయా రాయ్‌పూర్ పరిశీలించిన కేసీఆర్

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, మొక్కల పెంపకానికి, పౌరుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను కేసీఆర్ అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నయా రాయ్‌పూర్ పరిశీలించిన కేసీఆర్

నయా రాయ్‌పూర్ పరిశీలించిన కేసీఆర్

సరస్సులు కలుషితం కాకుండా చూసుకోవాలని సూచించారు. నయా రాయ్‌పూర్‌లో మొక్క నాటారు. సచివాలయంలో విజిటర్స్ రిజిస్టర్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని రాశారు.

కేసీఆర్

కేసీఆర్

ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న గోదావరి నదిని ఉమ్మడిగా ఉపయోగించుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపాదించారు.

కేసీఆర్

కేసీఆర్


గోదావరినదిపై ఇచ్ఛంపల్లి ప్రాజెక్టును నిర్మించుకోవటం ద్వారా రెండు రాషా్ట్రలకూ జల విద్యుత్‌, సాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు.

కేసీఆర్

కేసీఆర్

దీనిపై చర్చకు తాను మరోసారి ఛత్తీస్‌గఢ్‌ వస్తానని చెప్పారు. గంగా నదిలాగే గోదావరి కూడా పవిత్రమైనదని, పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న రెండు రాషా్ట్రలూ తరించాలని అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

‘‘ఈ రెండు రాష్ట్రాల బంధం చరిత్రాత్మకమైంది. కాకతీయుల కాలంలో రెండు ప్రాంతాలూ ఒకే రాజ్యంలో ఉన్నాయి. ఇప్పటికీ కాకతీయుల వంశస్తులు చత్తీస్‌గఢ్‌లో ఉన్నారు'' అని కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్, రమణ్ సింగ్

కేసీఆర్, రమణ్ సింగ్

విద్యుత్ పైన ఎంవోయు సందర్భంగా ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణతో బలమైన సంబంధాలు కొనసాగిస్తామన్నారు. కేసీఆర్ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌ ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+