వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర విభజన తర్వాత 45 రోజుల్లో ఏపికి రాజధాని

|
Google Oneindia TeluguNews

Telangana row: New capital for Seemandhra within 45 days, economic sops
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి (సీమాంధ్ర ప్రాంతం) 45 రోజుల్లో కొత్త రాజధానిని ఎంపిక చేస్తామని, అదే విధంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పన్ను రాయితీలు కూడా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. లోక్‌సభలో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం రోజున ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఈ అంశాలను కేంద్రం చేర్చినట్లు పిటిఐ కథనాలు వెల్లడించాయి.

పిటిఐ కథనం ప్రకారం.. విభజన తర్వాత తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆ బిల్లులో పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిని ఉమ్మడి రాజధానిగా పరిగణిస్తారు. సీమాంధ్ర ప్రాంత రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు ఓ కమిటీని కేంద్రం నియమిస్తుంది. ఆ కమిటీ 45 రోజుల్లోగా కొత్త రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేస్తుంది.

కొత్త రాజధాని నిర్మాణం కోసం అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్ భవన్, హై కోర్టు, ప్రభుత్వ సచివాలయం, శాసనసభ, శాసనమండలి మొదలైన ముఖ్య భవనాల నిర్మాణాలను కేంద్రమే చేపడుతుంది. రాజధాని కోసం డీ నోటిఫైడ్ అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది.

పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ ఉంటారు. రాజధాని ప్రాంతంలోని ప్రజలకు సంబంధించిన రక్షణ వ్యవహారాలను ఆయన చూస్తారు. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ఉన్నత స్థాయికి మండలిని ఏర్పాటు చేస్తుంది. రెండు రాష్ట్రాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యలను కేంద్రం చేపడుతుంది.

English summary
With an aim of cooling tempers in Seemandhra region, the government has promised in the Telangana Bill selection of a capital of residuary Andhra Pradesh within 45 days and tax incentives to promote its economic growth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X