ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తెలుగు మహిళ పోటీ: 30 శాతం ఓట్లు మనవే !

జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ప్రవాసాంధ్రురాలు లలిత మోహన్ తమిళనాడు తెలుగు మక్కల్ కట్చి పార్టీ పేరుతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల అధికారులు ఆమెకు చదరంగం చిహ్నం కేటాయ

చెన్నై: జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ప్రవాసాంధ్రురాలు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తెలుగు మహిళ సైలెంట్ గా ప్రచారం చేసుకుంటూ వెలుతున్నారు.

ఆర్ కే నగర్ నియోజక వర్గంలో దాదాపు 30 శాతం మంది ప్రవాసాంధ్రులు నివాసం ఉంటున్నారు. ఆర్ కే నగర్ నియోజక వర్గంలో ఎవరు విజయం సాధించాలన్నా ప్రవాసాంధ్రుల ఓట్లు కీలకం. స్థానిక ప్రవాసాంధ్రులు ఎవరివైపు మొగ్గు చూపుతారో వారినే విజయలక్ష్మి వరిస్తుంది.

మంత్రి, మాజీ మంత్రి మంతనాలు

మంత్రి, మాజీ మంత్రి మంతనాలు

తమిళనాడు మంత్రి, హోసూరు ఎమ్మెల్యే బాలక్రిష్ణారెడ్డి, తమిళనాడు మాజీ మంత్రి రమణ చెన్నైలోని పలు తెలుగు సంఘాల నాయకులతో చర్చించి టీటీవీ దినకరన్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. రెండు తెలుగు సంఘాల ప్రతినిథులు మూడు షరతులతో టీటీవీ దినకరన్ కు మద్దతు ప్రకటించారు.

ధైర్యంగా బరిలో నిలిచిన లలిత మోహన్

ధైర్యంగా బరిలో నిలిచిన లలిత మోహన్

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ప్రవాసాంధ్రురాలు లలిత మోహన్ బరిలో నిలిచారు. తమిళనాడు తెలుగు మక్కల్ కట్చి పార్టీ పేరుతో ఆమె ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల అధికారులు ఆమెకు చదరంగం (చెస్ బోర్డు) చిహ్నం కేటాయించారు.

సీరియల్ నెంబర్ 56

సీరియల్ నెంబర్ 56

ఈవీఎంలో ఆమె లలిత మోహన్ పేరు సీరియల్ నెంబర్ 56వ స్థానంలో ఉంది. గతంలో జయలలిత ఆర్ కే నగర్ నుంచి పోటీ చేసిన సమయంలో ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఉన్న చోట ఆమె తెలుగు బాషలోనే ప్రచారం చేశారు. అప్పట్లో ప్రవాసాంధ్రులు ఎక్కువ శాతం ఓట్లు జయలలితకే వేశారు.

జయలలిత లేకపోవడంతో సీన్ రివర్స్

జయలలిత లేకపోవడంతో సీన్ రివర్స్

జయలలిత మరణించడంతో ఆర్ కే నగర్ లో ప్రవాసాంధ్రుల ఓట్లు చీలిపోతున్నాయి. మొత్తం మీద లలిత మోహన్ అక్కడి తెలుగు వారి ఓట్లు చీల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రావాసాంధ్రులు ఎకతాటిపై నిలిచి అన్ని ఓట్లు లలిత మోహన్ కు వేస్తే ఆమె గెలిచినా ఆశ్చర్యం లేదని ఆర్ కే నగర ప్రజలు అంటున్నారు.

నాలుగు వర్గాలుగా

నాలుగు వర్గాలుగా

ఆర్ కే నగర్ నియోజక వర్గంలో ఇప్పటికే ప్రవాసాంధ్రులు జయలలిత మేనకోడలు దీపా, పన్నీర్ సెల్వం వర్గానికి, దినకరన్ వర్గానికి, లలిత మోహన్ కు మద్దతుగా ప్రచారం చేస్తూ నాలుగు ముక్కలుగా చీలిపోయారు. అయితే లలిత మోహన్ తెలుగు ఓటర్లను ఆకర్షించడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+