Temple: కోరికలు తీర్చాలని పూజలు చేశాడు, దేవుడు కరుణించలేదని ఏం చేశాడంటే ?
భోపాల్/ఇండోర్/ మధ్యప్రదేశ్: మన కోరికలు, కష్టాలు తీర్చాలని మనం దేవుడిని ప్రార్థిస్తుంటారు. కస్టాలు, సమస్యలు వచ్చిన సందర్బాల్లో దేవుడిని పదేపదే పూజిస్తూ ఆలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తారు. హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు ఇలా అన్ని మతాలవారు వారికి ఇష్టమైన దేవుడికి పూజలు, ప్రార్థనలు చేస్తుంటారు. అయితే ప్రతినిత్యం దేవుడికి పూజలు చేసినా ఆ దేవుడు తన కోరికలు తీర్చలేదని ఓ యువకుడు రగిలిపోయాడు. వరుసగా ఆలయాలను టార్గెట్ చేసుకున్నాడు.

ఆలయాల్లో శివుడి విగ్రహాలు ధ్వంసం
ఇక్కడ ఓ యువకుడు తన కోరికలు నెరవేరలేదన్న కోపంతో ఆలయంల్లోని విగ్రహాలను పగలగొట్టి అతని కోపం చల్లార్చుకున్నారు. దేవాలయాల్లో దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని చందన్ నగర్, చఠారిపురాల్లోని రెండు శివాలయాల్లో రాత్రిపూట శివుడి విగ్రహాలను ధ్వంసం చేశారు.

సీసీటీవీ కెమెరాల్లో ?
దేవాలయాల్లో శివుడి విగ్రహాలు ధ్వంసం చెయ్యడంతో స్థానికులు ఆందోళనకు వ్యక్తం చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న హిందువులను ఈ రెండు సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేయడంతో ఆ ప్రాంతానికి చెందిన కొన్ని హిందూ సంఘ, సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా రెండు ఆలయాల్లోని విగ్రహాలను ఒక్క యువకుడే ధ్వంసం చేసినట్లు తేలింది.

కోరికలు తీర్చాలని నిత్యం పూజలు
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు శుభం కైత్వాస్ (24) అనే యువకుడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో అతడు చెప్పిన మాటలకు స్థానిక ప్రజలు, పోలీసులు హడలిపోయారు. ఒక కంటిలో కంటి చూపు మందగించిన శుభం తన అంగవైకల్యాన్ని పోగొట్టుకోవడానికి ఆ ఆలయాల్లో నిత్యం పూజలు చేశాడు.

దేవుడు కరుణించలేదని
తాను నిత్యం పూజలు చేసినా కంటి చూపి రాలేదని, తన చిరకాల ప్రార్థనలు శివుడు ఆలకించలేదని, తన ఆశ నెరవేరలేదనే నిరాశతో శుభం ఇలా చేశాడని పోలీసులు అన్నారు. అరెస్టు అయిన శుభం తండ్రి చిన్న హార్డ్‌వేర్ దుకాణం నడుపుతున్నాడు పోలీసులు అన్నారు. శుభంకు ఎలాంటి నేర చరిత్రలేకపోయినా దేవాలయాల్లో విగ్రహాలు పలగొట్టిర రెండు వర్గాల మద్య చిచ్చ రేపాడని ఆరోపిస్తూ అతని మీద సెక్షన్ 295A కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications