అద్దె అడిగిన ఇంటి యజమానిని చంపిన వైనం ..కరోనాతో ఆర్ధిక కష్టాలే కారణం
కరోనా కష్టకాలంలో ఊహించని దారుణాలు జరుగుతున్నాయి. ఇంటి అద్దె అడిగినందుకు ఇంటి యజమానిని అత్యంత దారుణంగా చంపిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.
చెన్నైలోని కుండ్రటూరులో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళితే
ఇంటి అద్దె ఖచ్చితంగా ఇవ్వాలని గట్టిగా అడిగినందుకు అద్దెదారు కుమారుడు ఇంటి ఓనర్ ని హతమార్చాడు. ధనరాజ్ అనే వ్యక్తి గుణశేఖర్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా పనులు లేకపోవడంతో ధనరాజ్ అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడు. నాలుగు నెలల అద్దె ఇవ్వకపోవటంతో అద్దె కోసం గుణశేఖర్ ధనరాజ్ మీద పదేపదే ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ధనరాజ్ తో ఘర్షణకు దిగాడు. అద్దె చెల్లించాల్సిందే నంటూ భీష్మించుకు కూర్చున్నాడు.

అద్దె కోసం తన తండ్రిని నానా మాటలు అంటున్న ఇంటి ఓనర్ తీరును భరించలేకపోయాడు ధనరాజ్ కుమారుడు అజిత్. పట్టలేని కోపంతో ఇంటి యజమానిపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు . విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అజిత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో చెన్నైలో ఇంటి యజమానులు అద్దెకు ఉంటున్న వారిని అద్దె అడగాలంటేనే భయపడుతున్నారు .












Click it and Unblock the Notifications