నవంబర్ 16న దత్తత గ్రామంలో సచిన్ టెండూల్కర్
హైదరాబాద్: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నవంబర్ 16న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నాడు. ఇటీవల తాను దత్తత తీసుకున్న పుత్తమరాజు కండ్రిగ గ్రామాన్ని సందర్శించనున్నాడు. ఈ సందర్భంగా రూ. 3.50 కోట్లతో ఆ గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులను సచిన్ టెండూల్కర్ తన చేతుల మీదగా ప్రారంభిస్తాడు.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సవాల్‌ను స్వీకరించిన సచిన్ ఈ గ్రామాన్ని 'సన్‌సద్ ఆదర్శ్ గ్రామ్ యోచన' క్రింద ఈ గ్రామాన్ని దత్తతు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చనున్నారు.

పుత్తరాజుకండ్రిక గ్రామంలో 24 గంటలపాటు అందుబాటులో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్తనిర్మూలన వ్యవస్థ, శ్మశానం, సెల్‌ఫోన్ టవర్లు, వైఫై జోన్, బ్యాంకు, ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాలను నిర్మిస్తారు.












Click it and Unblock the Notifications