ఢిల్లీ వర్సిటీలో మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన-అడ్డుకున్న పోలీసులు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన కలకలం రేపుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను నిషేధించినా బీజేపీయేతర రాష్ట్రాల్లో దీన్ని ఎస్ఎఫ్ఐ ప్రదర్శిస్తోంది. పలుచోట్ల ఫేస్ బుక్ లోనూ ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు విఫలం చేసినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీపై వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలోని మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌లో ప్రదర్శించేందుకు వామపక్ష విద్యార్థి సంఘానికి చెందిన ముగ్గురు సభ్యులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని క్లాసుల్ని సస్పెండ్ చేశారు. ఈ సాయంత్రం.
ఆగ్నేయ ఢిల్లీలోని కళాశాల గేట్‌ల వద్దకు వాటర్ కానన్లు, బాష్పవాయువు ఫిరంగులు ప్రయోగించే వ్యాన్‌లతో పోలీసులు చేరుకున్నారు. నిన్న ఈ డాక్యుమెంటరీని ఫేస్ బుక్ లో ప్రదర్శిస్తామని ఎస్ఎఫ్ఐ నేతలు ప్రకటించడంపై స్పందించిన వర్శిటీ అధికారులు అందుకు అనుమతివ్వబోమన్నారు.

అలాగే ఢిల్లీలోనే జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో నిన్న సాయంత్రం విద్యార్థులు నిర్వహించిన ఇలాంటి స్క్రీనింగ్ విద్యార్థి సంఘం కార్యాలయంలో ఇంటర్నెట్, కరెంటు నిలిపివేయడంతో నిలిచిపోయింది. ఫోన్ స్క్రీన్‌లు లేదా వారి ల్యాప్‌టాప్‌లలో డాక్యుమెంటరీని చూడటానికి వందలాది మంది గుంపు బయట చీకటిలో గుమిగూడారు చివరికి సాయంత్రం నిరసన ప్రదర్శనతో ఇది ముగిసింది. ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని, క్యాంపస్‌లో శాంతి, సామరస్యాలకు విఘాతం కలుగుతుందని జేఎన్‌యూ అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications