వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ కాశ్మీర్ లో టెన్షన్ : డ్రోన్ల ద్వారా ఆయుధాల చేరవేత; చొరబాట్లతో దాడులకు ప్లాన్స్; రోజుకో ఘటన

|
Google Oneindia TeluguNews

జమ్మూ కాశ్మీర్ లో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఎప్పుడు ఎటు నుంచి ఎవరు ఎలా దాడి చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా జమ్మూకాశ్మీర్లో చోటుచేసుకుంటున్న పరిస్థితులు భారత భద్రతా దళాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశం కరోనా మహమ్మారిపై దేశం దృష్టి కేంద్రీకరించిన సమయంల, ఉగ్రమూక దేశంలో విధ్వంసాలకు ప్లాన్ చేసే పనిలో పడ్డారు. లష్కరే తోయిబా, ఆఫ్ఘనిస్తాన్ మూలాలున్న ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు జోరుగా సాగుతున్నాయని, ఈ పండుగల సమయంలో విధ్వంసాలకు ప్లాన్ చేస్తున్నారని ఇంటిలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో అడుగడుగున పహారా కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ ఉగ్ర మూకలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక మరోవైపు డ్రోన్ల ద్వారా తమ కార్యాకలాపాలు సాగించే పనిలో ఉన్నారు.

సరిహద్దులో పాకిస్తానీ డ్రోన్ చేరవేసిన ఆయుధాలు స్వాధీనం
తాజాగా జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్ డ్రోన్ ద్వారా ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రమూకకు చేరవేసే క్రమంలో భద్రతా సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ద్వారా అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహాంజానలోని అలోరా మండలం వద్ద అర్ధరాత్రి దాటిన తరువాత డ్రోన్ ఒక భారీ పెట్టెను ద్వారా విడిచినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఒక గ్రామస్తుడు పై నుండి ఏదో పడినట్లుగా శబ్దాన్ని విని, పోలీసులకు సమాచారం ఇచ్చాడు .

Tension in Jammu and Kashmir: arms delivery by drones; Plans for infiltration attacks

ఆయుధ సామాగ్రిలో ఏకే-47 అస్సాల్ట్ రైఫిల్ తో పాటు 30 రౌండ్లు బుల్లెట్ లు
పోలీసులు వెంటనే గ్రామాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పెట్టెను కనుగొని దాన్ని తెరిచి చూడగా అందులో ఒక ఏకే-47 అస్సాల్ట్ రైఫిల్, మూడు AK మ్యాగజైన్‌లు, 30 AK రౌండ్లు మరియు ఓ టెలిస్కోప్ ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఆ సమయంలో ఆ లోడ్ తీసుకెళ్లడానికి అక్కడ ఒక చెక్క బేస్ ను కూడా గుర్తించారు. పాకిస్తానీ డ్రోన్ ఈ ఆయుధాలను అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న ఉగ్రవాదుల కోసం చేరవేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇక వారి కోసం అక్కడ గాలింపు మొదలు పెట్టారు.

డ్రోన్ల ద్వారా ఉగ్ర దాడులకు స్కెచ్ .. ఆయుధాల చేరవేత
సోహాంజాన ప్రాంతంలో ఇటీవల సంవత్సరాలలో రాజకీయ ప్రోత్సాహం కింద పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి. ఆక్రమణదారులలో అండర్ గ్రౌండ్ లో పనిచేసే ఉగ్రవాదులు ఉన్నారన్న అంశాన్ని తోసిపుచ్చలేము అని అధికారి తెలిపారు. ఇక వారెవరు అన్నది గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. ఇటీవల కాలంలో డ్రోన్స్ ద్వారా ఆయుధాల మెటీరియల్ పంపించే మెకానిజం, దాడులకు పాల్పడే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే వీటికి చెక్ పెట్టడానికి భద్రతా బలగాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇదిలా ఉంటే వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాటు యత్నాలు నిత్యకృత్యంగా మారాయి.

యూరీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం .. చొరబాటు యత్నాలకు ఆర్మీ చెక్
యూరీ తరహా ఆత్మాహుతి దాడికి గత నెలలో పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. భారత దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను మట్టు పెడుతూ ఎక్కడికక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు భారత సైన్యం చెక్ పెడుతోంది. అయినప్పటికీ ఉగ్రవాద కార్యక్రమాలు భారత సరిహద్దుల్లో నిత్యకృత్యంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల యూరీలో చొరబాటుకు యత్నించిన పలువురు ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఒక ఉగ్రవాది పట్టుబడ్డాడు. అతను తాను ఎలా ఉగ్రవాదంలోకి వెళ్ళారో, ఎలా ట్రైనింగ్ ఇచ్చారో చెప్పారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ కు ఉన్న లింక్ ఏమిటో కూడా అతను స్పష్టంగా చెప్పారు.

Recommended Video

భారత్ లో చొరబాటుకు పాక్ యత్నం..పాక్ డ్రోన్ ను ధ్వంసం చేసిన భారత ఆర్మీ!! | Oneindia Telugu

పాక్ సైన్యం పాత్ర లేకుండా ఉగ్రవాదుల చొరబాటు సాధ్యం కాదన్న ఆర్మీ
ఈ క్రమంలో పాకిస్థాన్ సైన్యం పాత్ర లేకుండా ఇంత పెద్ద సంఖ్యలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు జరగవని యూరీలో పట్టుబడిన ఉగ్రవాదిపై మాట్లాడిన అధికారులు చెప్పారు . నియంత్రణ రేఖ అంతటా విపరీతమైన ఉగ్రవాద కదలికలు ఉన్నాయని మేజర్ జనరల్ వాట్స్ చెప్పారు. ప్రస్తుతం కాశ్మీర్ శాంతియుతంగా ఉందని, కాశ్మీర్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులను పంపుతుందని చెప్తున్నారు.భారత సైన్యం ఉగ్రవాదుల కుట్రలను ధీటుగా ఎదుర్కొంటుందని చెప్తున్నారు.

English summary
Security forces seized weapons and ammunition from a Pakistani drone in Jammu district . Authorities say it contained an AK-47 assault rifle, three AK magazines, 30 AK rounds and a telescope.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X