వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూకాశ్మీర్ బోర్డర్ లో టెన్షన్: చొరబాట్లకు 250మంది ఉగ్రవాదులు రెడీ; ఇంటిలిజెన్స్ హెచ్చరిక!!!

|
Google Oneindia TeluguNews

భారతదేశానికి ఉగ్రవాదులతో నిరంతరం పోరు తప్పటం లేదు. భారతదేశంపై దాడులు చేయడానికి, అలజడి సృష్టించటానికి ఉగ్రవాదులు పదేపదే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి భారతదేశంలోకి ఉగ్రవాద మూకలు చొరబాట్లకు యత్నించటం కూడా నిత్యకృత్యంగా మారింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల సహకారంతో 250 మంది ఉగ్రవాదులు భారత్ లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఇంటిలిజెన్స్ వర్గాల నుండి హెచ్చరికలు వస్తున్నాయి.

చొరబాట్లకు రెడీ అయిన 250 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు

చొరబాట్లకు రెడీ అయిన 250 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు

టెర్రరిజం దేశానికి అతి పెద్ద సమస్యగా మారింది. శాంతిభద్రతలను పరిపక్షించటం కోసం ఉగ్రవాద మూకకు అడ్డుకట్ట వెయ్యటం, టెర్రరిస్టుల నుండి దేశాన్ని కాపాడటం భద్రతా బలగాలకు కత్తిమీద సాములా తయారైంది. నియంత్రణ రేఖ వద్ద పహారా కాస్తున్న భద్రతా దళాలు ఎండనకా, వాననకా దేశ భద్రత కోసం కాపలా కాస్తున్నారు. సరిహద్దులలో దేశాన్ని టెర్రరిస్టుల చొరబాట్ల నుండి రక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారని నియంత్రణ రేఖ వద్ద సుమారు 250 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిర్వహిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఉత్తర కాశ్మీర్లోని కేరన్ పోస్ట్ వద్ద నిఘా తీవ్రతరం

ఉత్తర కాశ్మీర్లోని కేరన్ పోస్ట్ వద్ద నిఘా తీవ్రతరం

పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని లాంచ్ సైట్‌లలో ఉన్నట్లు నిఘా అంచనాలు సూచిస్తున్నందున, సరిహద్దు ఆవల నుండి దురుద్దేశపూరిత ఉద్దేశ్యాన్ని నిరోధించడానికి నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి ఉన్న భారత సైన్యం తన ముందడుగు వేసింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, నియంత్రణ రేఖకు సమీపంలోని కశ్మీర్‌లోని ఉత్తర ప్రాంతమైన కేరాన్ సెక్టార్‌లో సైనికులు నిఘాను మరింత పెంచారు. సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసిన భారత భద్రతా దళం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధమైంది. ముఖ్యంగా ఉత్తర కాశ్మీర్లోని కేరన్ పోస్ట్ వద్ద నిఘాను తీవ్రతరం చేసింది.

టెర్రరిస్టుల చొరబాట్ల యత్నాలపై ఇంటిలిజెన్స్ సమాచారం

టెర్రరిస్టుల చొరబాట్ల యత్నాలపై ఇంటిలిజెన్స్ సమాచారం

250 మందికి పైగా ఉగ్రవాదులు కాశ్మీర్ లోయను దాటేందుకు వివిధ టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లలో సరిహద్దు వెంబడి వేచి ఉన్నారని భద్రతా దళాలకు ఇన్‌పుట్‌లు ఉన్నాయి. అయితే ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కరించడానికి భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నారు. ఆర్మీ మరియు బిఎస్ఎఫ్ యొక్క ఉన్నత స్థాయి అధికారులందరూ ఎల్‌ఓసికి ప్రత్యేక సందర్శనలు చేస్తూ గ్రౌండ్ జీరోలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉగ్రవాదులు సరిహద్దులో చొరబాట్లపైనే కాకుండా మాదక ద్రవ్యాల రవాణాపై కూడా సైన్యం ఆందోళన చెందుతుంది.

ఉగ్రవాదుల చొరబాట్లు, మాదకద్రవ్యాల రవాణాపైనా దృష్టి పెట్టిన ఆర్మీ

ఉగ్రవాదుల చొరబాట్లు, మాదకద్రవ్యాల రవాణాపైనా దృష్టి పెట్టిన ఆర్మీ

కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేసేందుకు సరిహద్దులో పెరుగుతున్న మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ను పాకిస్థాన్ ఉపయోగించుకుంటోందని జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ ఇటీవల పేర్కొన్నారు.
తాము ఉగ్రవాదుల చొరబాటు మరియు ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిశితంగా దృష్టి పెట్టామని చెప్పారు. వచ్చేది శీతాకాలం కావటంతో మరింత అప్రమత్తంగా ఉంటున్నామని చెప్తున్నారు.

సాంకేతిక పరికరాలతో బోర్డర్ లో నిఘా.. పెంచిన పెట్రోలింగ్

సాంకేతిక పరికరాలతో బోర్డర్ లో నిఘా.. పెంచిన పెట్రోలింగ్

సరిహద్దులో కాపలా కాస్తున్న భద్రతా సిబ్బందికి అధునాతన ఆయుధాలు, రాత్రిపూట నిఘాతో కూడిన నిఘా కెమెరాలు, డ్రోన్‌లు మరియు థర్మల్ ఇమేజింగ్ ట్రేసర్‌లతో కూడిన అన్ని కొత్త సాంకేతిక పరికరాలు అందించారు. నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్‌ను కూడా పెంచినట్టు వెల్లడించారు.తాము ఏడాది పొడవునా నియంత్రణ రేఖ వద్ద 24 గంటలూ కాపలాగా ఉన్నామని, ఈ ప్రాంతంలో చొరబాటుకు అవకాశం లేదని పేర్కొన్నారు. ఏ చొరబాటుదారుని భారత భూభాగంలోకి రానివ్వబోమని వెల్లడించారు. దేశంలోని పౌరులు సురక్షితంగా ఉన్నారని వారికి భరోసా ఇవ్వటానికి తాము విధులు నిర్వర్తిస్తున్నామని చెప్తున్నారు.

English summary
There are warnings from intelligence sources that 250 terrorists are trying to enter India with the help of Pakistan inspired terrorist organizations. This alerted the army. Increased security at the borders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X