Terrarist: వాడి ఇల్లు నేలమట్టం, భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కు పనిచేస్తే ఇదేగతి !
జమ్మూ కాశ్మీర్/ న్యూఢిల్లీ: పాకిస్తాన్ తో చేతులు కలిపి ఉగ్రవాద కార్యకలాపాలు సాగించి భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదికి అధికారులు సరైన బుద్ది చెప్పారు. జైష్ ఏ మోహమ్మద్ (జేఇఎం) ఉగ్రవాద కమాండర్ ఆశీక్ నెంగ్రూ ఇంటిని అధికారులు నేలమట్టం చేశారు. భారత్ లో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలు చేసే వారికి ఇదే జరుగుతోందని అధికారులు హెచ్చరించారు.
శ్రీనగర్ సమీపంలోని రాజపూర్ లోని న్యూ కాలనీలో ప్రభుత్వ భూమిని అక్రమించుకున్న జైష్ ఏ మోహమ్మద్ ఉగ్రవాద కమాండర్ ఆశీక్ నెంగ్రూ రెండు అంతస్తుల భవనం నిర్మించాడు. 2019లో పూల్వామా దాడిలో ఉగ్రవాదులు దాడులు చెయ్యడంతో 40 మంది సైనికులు వీరమరణం పొందరారు.

శనివారం పోలీసుల సమక్షంలో జిల్లాధికారులు జైష్ ఏ మోహమ్మద్ ఉగ్రవాద కమాండర్ ఆశీక్ నెంగ్రూకి చెందిన రెండు అంతస్తుల భవనం నేలమట్టం చెయ్యడానికి వెళ్లారు. ఆ సందర్బంలో టీఆర్ ఎఫ్ ఉగ్రవాద సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు వ్యతిరేకించారు. అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బుల్డోజర్లతో రెండు అంతస్తుల భవనం నేలమట్టం చేశారు. భారత్ లో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలు చేసే వారికి ఇదే జరుగుతోందని అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications