సైనిక వాహనంపై ఉగ్రదాడి: ఇద్దరు జవాన్లతోపాటు నలుగురు మృతి, పలువురికి గాయాలు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గుల్‌మార్గ్‌లో భారత ఆర్మీ వాహనంపై దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లతోపాటు నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన సైనికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఉగ్రదాడి నేపథ్యంలో భారీగా భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో మోహరిచాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో ఇది మూడో ఉగ్రదాడి కావడం గమనార్హం. అంతకుముందు అక్టోబర్ 20న గందర్ బాల్ ప్రాంతంలో జరిగి ఉగ్రదాడిలో వైద్యుడితోపాటు ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఉదయం కూడా స్థానికేతర కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు.

Terror Attack Army Porter Killed Near Gulmarg s Botapathri 5 Jawans Injured

గుల్‌మార్గ్‌లో జరిగిన ఉగ్రదాడిపై బారాముల్లా జిల్లాలోని బోటపత్రి వద్ద ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపినట్లు సైనికాధికారులు తెలిపారు. గుల్‌మార్గ్‌లో సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడికి ముందు పుల్వామాల అనుమానాస్పద ఉగ్రదాడిలో స్థానికేతర కార్మికుడు గాయపడ్డాడు. ఉగ్రవాదులకాల్పుల్లో గాయపడిని కార్మికుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుభం కుమార్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాగా, గత కొంత కాలంగా స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు.

కాగా, అక్టోబర్ 20న గాందర్‌బల్ జిల్లాలోని సోన్‌మార్గ్ ప్రాంతంలో ఓ సొరంగ మార్గం నిర్మాణ ప్రదేశంలో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వైద్యుడు సహా ఏడుగురు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి భద్రతా దళాలు. దాడి చేసిన వారిని గుర్తించడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పరిస్థితిని అంచనా వేయడానికి కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి), వికె బిర్డితో సహా ఉన్నత భద్రతా అధికారులు సంఘటనా స్థలానికి పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+