14/02: సరిగ్గా ఈ రోజే మరోదాడికి యత్నం..?, ఉగ్ర కుట్ర భగ్నం, 7 కిలోల ఐఈడీ సీజ్
పుల్వామాలో ముష్కరులు తెగబడి నేటితో రెండేళ్లు గడచిపోయింది. ఆ రోజును గుర్తుచేసుకొని ప్రతీ ఒక్కరు చీకటి రోజు అని అనుకున్నారు. ఇంతలో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. ఇవాళ మరో దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. భారీ ఉగ్రదాడి కోసం జరిగిన కుట్రను జమ్ము పోలీసులు భగ్నం చేశారు. రద్దీగా ఉండే జమ్ము బస్టాండు సమీపంలో 7 కిలోల శక్తివంతమైన పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఘటనకు సంబంధించి ప్రమేయం ఉందని అనుమానిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఛండీగఢ్‌కు చెందిన సుహైల్‌తో పాటు ఖాజీ అనే మరొకరిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నామని జమ్మూ ఐజీ ముఖేష్ సింగ్ తెలిపారు. ఫుల్వాలా దాడి ఘటన రెండో వార్షికోత్సవం సందర్భంగా ఉగ్రవాద సంస్థలు దాడులకు ప్లాన్ చేస్తున్నారనే సమాచారంతో గత రెండు మూడు రోజులుగా చాలా అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.

శనివారం రాత్రి సుహైల్‌ను పుల్వామాలో పట్టుకున్నామని.. అతని వద్ద 6 నుంచి 6.5 కిలోల ఐఈడీ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఐఈడీని అమర్చాల్సిందిగా పాకిస్థాన్‌కు చెందిన అల్ బదర్ తాంజీమ్ నుంచి తమకు సందేశం వచ్చినట్టు విచారణలో సుహైల్ వెల్లడించాడని పేర్కొన్నారు.. ఛండీగఢ్‌కు చెందిన ఖాజీ అనే వ్యక్తిని కూడా అదుపులోనికి తీసుకున్నామని ఐజీ తెలిపారు.
Recommended Video
రఘునాథ్ ఆలయం, లేక్‌దత్త బజార్, జమ్మూ రైల్వేస్టేషన్ ఉగ్రవాదుల టార్కెట్‌గా ఉన్నాయని తమకు తెలిసిందని ఐజీ వివరించారు. పాక్ ప్రేరేపిత అల్ బదర్ ఉగ్రవాద సంస్థ పంజాబ్‌లో చదువుకుంటున్న కొందరు కశ్మీరీ విద్యార్థులను టెర్రరిస్టులుగా వాడుకుంటూ ఇలాంటి ఘటనలకు ప్రేరేపిస్తోందని చెప్పారు. సాంబ జిల్లాలో 15 చిన్న ఐఈడీలు, ఆరు పిస్తోళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ద్వారా వీటిని వదిలినట్టు అనుమానిస్తున్నామని వివరించారు.












Click it and Unblock the Notifications