వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాట్నా పేలుళ్లు: యువతి అరెస్ట్, ప్రేమించి ఇస్లాంలోకి..!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Terror link woman arrested
మంగళూరు: పాట్నా వరుస పేలుళ్ల కేసుకు సంబంధించిన కేసులో ఉగ్రవాది ఆయేషా బానును మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు కర్నాటకలోని మంగళూరులో ఆయేషా అలియాస్ ఇందిరను అరెస్టు చేశారు.

ఆయేషా ఇండియన్ ముజాహిదీన్‌కు నిధులు సమకూర్చి పెడుతున్నట్లుగా దర్యాఫ్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఆమె కర్నాటకలోని పంజిమోగేరులో నివసిస్తోంది.

సమాచారం మేరకు ఆమె నవంబర్ 11వ తేది సాయంత్రం వరకు ఇంటి వద్దే ఉంది. మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఇండియన్ ముజాహిదీన్‌తో సంబంధాలపై ఆరా తీసే ఉద్దేశ్యంలో భాగంగా దర్యాఫ్తు అధికారులు ఆమెను అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు.

ఆయేషా హిందువుగా జన్మించింది. ఓ ముస్లిం వ్యక్తితో ప్రేమలో పడింది. దాంతో ఆమె ఇస్లాంను స్వీకరించింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు పంజిమోగేరుకు పదేళ్ల క్రితం వచ్చారు. ఆమె భర్త బీడి వ్యాపారం చేస్తాడు.

ఆయేషా వివిధ పేర్లతో బ్యాంకు అకౌంట్లు ఉపయోగిస్తున్నట్లుగా దర్యాఫ్తు అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. హిందూ యువకులను మచ్చిక చేసుకొని వారి పేరు మీద బ్యాంకు అకౌంట్ తీసి, సూచనలు కూడా చేసేదట. వారి పేర మీద వచ్చిన డబ్బులను ఇండియన్ ముజాహిదీన్ ఎటిఎంల ద్వారా డ్రా చేసుకునేదట. ఇందుకు గాను వారికి కొంత డబ్బును ఇచ్చే వారని తెలుస్తోంది.

గత రెండు నెలలుగా అకౌంటల నుండి కోటి రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయేషా పాకిస్తాన్ తదితర దేశాల నుండి ఫండ్స్ రాబడుతోందని గుర్తించినట్లుగా తెలుస్తోంది. కాగా ఆయేషా తనంతట తాను ఉండేదని, ఎవరితోను కలిసేది కాదని, అంతకుమించి ఆమె గురించి తమకు తెలియదని స్థానికులు చెబుతున్నారట. మరోవైపు ఆయేషా భర్తను కూడా విచారిస్తున్నట్లుగా సమాచారం.

English summary
In a revelation that indicates deeping terror links in the city, a woman has been reportedly arrested for supplying money to terror suspects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X