ఆదివారం మార్కెట్లో ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి: 12 మందికి గాయాలు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. శ్రీనగర్‌లోని టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్‌కు సమీపంలో ఆదివారం నిర్వహించే సంతలో గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉగ్రదాడి సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో లష్కరే తోయిబాకు చెందిన పాకిస్థానీ టాప్ కమాండర్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టిన ఒక రోజు అనంతరం ఈ ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Terrorist grenade attack in Srinagar Sunday market 12 injured

కాగా, శ్రీనగర్ టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ సమీపంలో గ్రెనేడ్ పేలుడులో గాయపడిన వారంతా ముగ్గురు మైనర్లతో సహా యువకులే ఉన్నారు. గాయపడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. .

1. మిస్బా (17)
2. అజాన్ కలూ (17)
3. హబీబుల్లా రాథర్ (50)
4. అల్తాఫ్ అహ్మద్ సీర్ (21)
5. ఫైజల్ అహ్మద్ (16)
6. ఉర్ ఫరూక్
7. ఫైజాన్ ముష్తాక్ (20)
8. జాహిద్ ( 19)
9. గులాం మహమ్మద్ సోఫీ (55)
10. సుమయ్య జనవరి (45)

కాగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ వార్తలపై స్పందిస్తూ.. "అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం సమర్థనీయం కాదు" అని అన్నారు. పేలుడు సంభవించిన వెంటనే భద్రతా బలగాలు, వైద్య బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను శ్రీనగర్‌లోని శ్రీ మహారాజా హరిసింగ్ ఆసుపత్రికి తరలించారు.

ఆ ప్రాంతంలో భారీ భద్రతా బలగాలను మోహరించారు. కాగా, జమ్మూకాశ్మీర్‌లో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా శనివారం ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ ఉస్మాన్‌ను అంతమొందించినట్లు సైన్యం ప్రకటించింది. మరోవైపు, అనంతనాగ్ జిల్లా షాంగస్-లర్నూ ప్రాంతంలో జరిగిన మరో ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+