
భారత్ కు ఉగ్ర ముప్పు .. రోజుకో కొత్త ప్లాన్ లో ఉగ్రవాదులు, బోర్డర్ లో ఆర్మీకి రోజుకో రిస్కీ టాస్క్ !!
భారతదేశానికి ఉగ్ర ముప్పు పొంచి ఉందా? పుల్వామా ఉగ్రదాడి తరువాత నుండి ఇప్పటి వరకూ భారతదేశంలో ఉగ్రవాదుల పన్నాగాలను కనిపెట్టడం ఆర్మీ కి రిస్కీ టాస్క్ గా మారిందా? రోజుకో కొత్త ప్లాన్తో ఉగ్ర మూక భారత్లో విధ్వంసాన్ని సృష్టించడానికి ప్లాన్ చేస్తుందా? భారత ప్రభుత్వానికి ఉగ్ర సవాళ్ళను ఎదుర్కోవటం తలనొప్పిగా మారిందా? అంటే గత రెండేళ్లుగా వరుసగా జరుగుతున్న పరిణామాలు అవును అనే సమాధానం చెబుతున్నాయి.తాజా పరిణామాలతో బోర్డర్ లో భారత సైన్యం చేస్తున్న పోరాటం, ఉగ్రవాద కార్యాకలపాలపై వన్ ఇండియా అందించే ప్రత్యేక కథనం.
డ్రోన్లు
రోడ్లపై
తయారు
కాలేదు
..
పాక్
సహకారంతోనే
డ్రోన్ల
దాడి
:
జనరల్
పాండే

పుల్వామా దాడుల తర్వాత నుండి చొరబాట్లకు అనేక యత్నాలు
పుల్వామా ఉగ్రదాడి తరువాత నుండి ఇప్పటి వరకూ భారతదేశంలోని ఉగ్రమూక చొరబడడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ ఉన్న ఉగ్రవాదులకు ఆయుధ సామాగ్రి అందించడానికి డ్రోన్లను వినియోగించడం , పావురాల ద్వారా సందేశాలను పంపడం, సొరంగ మార్గం ద్వారా భారత్ లోకి ప్రవేశించటానికి ప్రయత్నాలు చెయ్యటం అనేక పరిణామాలు గత రెండేళ్లుగా చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల నుండి భారత్ లోకి ప్రవేశించటానికి అనేక సొరంగ మార్గాలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. భారత సైన్యం వాటిని గుర్తించే పనిలో ఉంది.

రోజుకో కొత్త టాస్క్ .. ఉగ్రవాద మూకలకు చెక్ పెడుతున్న ఇండియన్ ఆర్మీ
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు బాగా జరిగిందని, అప్పటి నుండి జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు వున్నారని సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న భారత సైన్యానికి దొరకకుండా సెప్టిక్ ట్యాంక్ లను నివాసంగా మార్చుకొని జీవించడం కూడా ఉగ్రవాదులను కనిపెట్టటంలో కొత్త సవాల్ గా మారాయి. ఈ పరిణామాలన్నింటితో ఉగ్ర మూకలు భారత భద్రతా దళాలకు రోజుకో కొత్త టాస్క్ ఇచ్చాయి అని చెప్పాలి.ఒక పక్క సోషల్ మీడియా ద్వారా యాక్టివిటీస్ చేస్తూ భారత్లో విధ్వంసానికి కుట్రలు చేస్తున్న ఉగ్రవాదుల కుట్రను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వాళ్ల దాడులను నిలువరించడం పై ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

తాజాగా డ్రోన్ టెక్నాలజీపై ఆందోళన .. యాంటీ డ్రోన్ టెక్నాలజీ కోసం ఆర్మీ యత్నం
డ్రోన్ల ద్వారా టెక్నాలజీని ఉపయోగించి జమ్ము లోని భారత వైమానిక స్థావరం పై బాంబు దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఇప్పుడు యాంటీ డ్రోన్ టెక్నాలజీని భారత్ కు తీసుకురావడంపై ఆర్మీ కసరత్తు చేస్తుంది. ఒకపక్క టెక్నాలజీని వాడుకుంటూ, మరోపక్కఏ మాత్రం అవకాశం దొరికినా దాడులకు తెగబడుతూ ఉగ్రవాదులు నిత్యం ఇండియన్ ఆర్మీ కి సవాల్ విసురుతున్నారు. జమ్మూకాశ్మీర్లో తాజా పరిణామాలు భారత ప్రభుత్వానికి సైతం ఆందోళన కలిగిస్తున్నాయి.

పాకిస్తాన్ ఈ కుట్రల వెనుక .. యూఎన్ కు ఫిర్యాదు
డ్రోన్ల ద్వారా బాంబులను జారవిడిచే ఉగ్రవాదుల టెక్నాలజీ వెనుక ఉన్న హస్తం పాకిస్తాన్ ప్రభుత్వానిదే అని ఇండియన్ ఆర్మీ గట్టిగా చెబుతుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని యునైటెడ్ నేషన్స్ కు సైతం ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ గత వారంలో ఏడు డ్రోన్లు మిలట్రీ స్థావరాలపై దాడులకు ప్రయత్నించడం దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందన్న భావనను కలిగిస్తుంది.గత రెండేళ్లుగా జమ్మూకాశ్మీర్లో అనేకచోట్ల ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన ఇండియన్ ఆర్మీ అనేకమందిని ఉగ్రవాదులను మట్టుబెట్టింది .

బోర్డర్ లో సైన్యానికి నిత్యం కొత్త టాస్క్ లే .. సీరియస్ గా ఆలోచిస్తున్న భారత ప్రభుత్వం
అయినప్పటికీ ఇంకా చాపకింద నీరులా జమ్మూకాశ్మీర్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతుండడం బోర్డర్లో సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బోర్డర్ లో గస్తీ పెంచి నిత్యం పహారా కాస్తున్నాయి భారత భద్రతా దళాలు. ప్రతి రోజు ఉగ్రవాదులు ఇచ్చిన కొత్త టాస్క్ లతో ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడానికి భారత భద్రతా దళాలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఒకపక్క దేశంలోని కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత ప్రభుత్వం, ఉగ్రవాదానికి చెక్ పెట్టడానికి సీరియస్ గానే అడుగులు వేస్తుంది.