ఆర్మీ క్వార్టర్స్‌పై ఉగ్రదాడి: ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో మరణించారు. నలుగురు గాయపడ్డారు. ఇద్దరు ఉగ్రవాదులు సుంజవాన్ సైనిక క్వార్టర్స్‌లోకి చొచ్చుకుని వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది.

కాల్పులు ఆగిపోయాయి. భద్రత బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశాయి. పోలీసులు, భద్రత బలగాల సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. సంఘటనా స్థలానికి 500 మీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలను మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Terrorists Attack Army Camp In Jammu, Soldier, Daughter Injured

శనివారం ఉదయం 4.55 గంటల ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు అనిపించాయి. సెంట్రీ బంకర్ కాల్పులు జరపగా ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. ఏదో ఒక ఫ్యామిలీ క్వార్టర్‌లో ఉగ్రవాదులు ఉన్నారని అనుమానిస్తన్నారు.

జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నట్లు జమ్మూ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్డీ సింగ్ జమ్వాల్ చెప్పారు జమ్మూలో ఇటువంటి దాడి ఈ ఏడాదిలో ఇదే తొలిసారి అని అన్నారు.

జమ్మూలోని జమ్మూ పఠాన్‌కోట్ ప్రధాన రహదారిపై పలు ఎకరాల్లో ఈ మిలిటరీ స్టేషన్ విస్తరించి ఉంది. అందులో ఇళ్లు మాత్రమే కాకుండా పాఠశాల కూడా ఉంది. వెనక గేటు నుంచి ఉగ్రవాదులు లోనికి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు

ఎందరు ఉగ్రవాదులు లోనికి ప్రవేశించారు, లోనికి ఎలా రాగలిగారనేది తెలియదని పోలీసు అధికారులు అంటున్నారు. శిబిరం చుట్టుపక్కల పలు నివాసిత ప్రదేశాలు ఉన్నాయి భారీ భద్రతా బలగాలను మోహరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least two terrorists stormed the family quarters at Sunjawan Army camp in Jammu and Kashmir early this morning and fired indiscriminately injuring a hawaldar and his daughter, police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి