టెర్రరిస్టులు .జైల్లో చికెన్ బిర్యానీలు తిన్నారు :శివరాజ్ సింగ్ చౌహన్
బోపాల్ : మద్యప్రదేశ్ రాష్ట్రంలో సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ పై విపక్షాలు, హాక్కుల కార్యకర్తలు చేస్తోన్న విమర్శలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఎదురుదాడికి దిగారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారికి శిక్ష వేయడానికి సమయం పట్టిందన్నారు.సంవత్సరాల తరబడి జైల్లో చికెన్ బిర్యానీలు పెట్టారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అనేక మందిని పొట్టనబెట్టుకొన్న ఉగ్రవాదులప కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కేసులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.పోలీసులపై సిమి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన తర్వాతే విధిలేకే పోలీసులు కాల్పులకు తెగబడ్డారని ఆయన చెప్పారు.సిమి ఉగ్రవాదులు తప్పించుకొన్న జైలును ఆయన బుదవారం నాడు సందర్శించారు.ఈ జైలులో భద్రత సరిగా లేదని పోలీసు అధికారులు అంగీకరించారు.

నిరాయుధులే...తప్పేంటీ
జైలు నుండి తప్పించుకొన్న సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ పై ఉగ్రవాద నిరోధక దళం చీఫ్ సంజీవ్ షమీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఎన్ డి టివి చానల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ కౌైంటర్ జరిగిన సమయంలో ఉగ్రవాదులు నిరాయుదులేనన్నారాయన.పోలీసులు ఎప్పుడు ఆయుధాలు ఉపయోగించాలో తెలుసునని చెప్పారు.
సిమి ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో చనిపోయారని పోలీసులు చెబుతుండగా, షమీ వారి వాదనకు విరుద్దంగా ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేగుతోంది.సిమి ఉగ్రవాదులు చనిపోయిన విషయం తొలుత ప్రకటించింది తానేనని ఈ ఘటనకు పూర్తి సమాచారం ఉందని ఆయన ఎన్ డి టి వి కి చెప్పారు.












Click it and Unblock the Notifications