ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం...వదిలేది లేదు: ప్రధాని మోడీ
జమ్మూకశ్మీర్‌లో గురువారం సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. భద్రతపై కేబినెట్ కమిటీ సమీక్ష సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కోసం రెండు నిమిషాలు మౌనం వహించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. పుల్వామా దాడులకు పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ప్రాణాలను త్యాగం చేసిన జవాన్లకు మోడీ సెల్యూట్ చేశారు.

పుల్వామా దాడులను పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయపార్టీలు ఖండించాలని ప్రధాని పిలుపునిచ్చారు. దాడులపై రాజకీయ చేయడం సరికాదన్నారు. భారత ఆర్మీపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న మోడీ... ఇలాంటి దాడులు బలమైన భారత్ సంకల్పాన్ని పెకిలించలేవన్నారు. ఈ దాడికి పాల్పడిన వారికి సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తామని మోడీ పాక్‌ను హెచ్చిరించారు. కచ్చితంగా ప్రతీకారదాడులు ఉంటాయని మోడీ స్పష్టం చేశారు.
#WATCH PM Narendra Modi at the launch of Vande Bharat Express observes a two-minute silence for the CRPF personnel who lost their lives in #PulwamaAttack. pic.twitter.com/PIRRVHUrFI
— ANI (@ANI) February 15, 2019
భారత ఆర్మీకి అన్ని రకాల అధికారాలు ఇచ్చామని సరైన సమయంలో రియాక్ట్ అవుతాయని చెప్పారు. పాకిస్తాన్ పాల్పడిన ఈ నీచపు చర్యకు దేశ ప్రజల రక్తం ఉడుకుతోందని చెప్పారు. ఇలాంటి దాడులతో భారత్‌ను బలహీనపర్చాలని పాకిస్తాన్ భావిస్తోందని కానీ ఇలాంటి దాడులు భారత్ దృఢ సంకల్పాన్ని దెబ్బతీయలేవని మరోసారి వెల్లడించారు. ఈ దుశ్చర్యపై గళం విప్పి ఖండించిన ప్రతి దేశ పౌరుడికి ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోడీ.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications