బ్యాంకుపై ఉగ్రవాదుల దాడి.. రూ.2 లక్షల దోపిడీ
జమ్ము కశ్మీర్ లోని షోపియన్ జిల్లాలో గురువారం ఉదయం జమ్ము కశ్మీర్ బ్యాంకు బ్రాంచిపై ఉగ్రవాదులు దాడి చేసి రూ.2 లక్షలకు పైగా నగదును దోచుకుని పారిపోయారు.
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం షోపియన్ జిల్లాలోని తుర్కువాంగం ప్రాంతంలో ఉన్న జమ్ము కశ్మీర్ బ్యాంకు బ్రాంచిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
నలుగురు ఉగ్రవాదులు తుపాకులు చూపి బ్యాంకు సిబ్బందిని బెదిరించి.. రూ.2 లక్షలకుపైగా నగదును దోచుకుని అక్కడ్నించి పారిపోయారు. బ్యాంకు సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.

ఈ విషయం తెలియగానే భద్రత దళాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. గత నవంబర్ లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు కొన్ని చోట్ల బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు.
గురువారం ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించేందుకు సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. దోపిడీ అనంతరం బ్యాంకులోంచి బయటికొచ్చిన ఉగ్రవాదులు గాల్లోకి కొన్ని రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications